చంద్రయాన్ 3 పై అన్ని దేశాలు ప్రశంసిస్తుంటే ఈ దేశం మాత్రం అక్కసు వెళ్లగక్కింది

చంద్రయాన్ 3, భారత దేశ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో మరోసారి నిలబెట్టిన ఉపగ్రహం.. భారత నేలపై నుంచి సగర్వంగా నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ 3 40 రోజుల యాత్రను ముగించి దిగ్విజయంగా ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాల సమయంలో చంద్రుడి నేలను ముద్దాడింది.

అయితే మరొక విషయం ఏమిటంటే, చందమామపై కాలు మోపిన నాలుగో దేశం భారత్ అయితే దక్షిణ ధృవం పై తొలిసారి కాలు మోపిన రికార్డు భారత్ సొంతం చేసుకుంది.

భారత సత్తా మరియు సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి మరోసారి మారు మ్రోగి పోయేలా చేసింది చంద్రయాన్ 3.

యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ ప్రయోగం పై దాదాపు అన్ని దిగ్గజ దేశాలు ప్రశంసలు కురిపిస్తుండగా ఒక దేశం మాత్రం అక్కసు వెళ్లగక్కుతుంది.

అయితే అది పాకిస్తాన్ అనుకుంటే మీ పొరపాటే.. మనల్ని రెండు వందల సంవత్సరాల పాటు దోచుకొని పారిపోయిన బ్రిటన్ దేశస్తులు మనపై అక్కసు చూపించడం విడ్డూరం.

పరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ సైతం భారీగా ఈ ప్రయోగానికి కవరేజ్ ఇవ్వడం జరిగింది. అగ్ర దేశాల సైతం భారత్ కు శుభాకాంక్షలు తెలిపాయి. అనేక దేశాల వార్తా పత్రికల్లో భారీ పతాక శీర్షికలతో ఇస్రో విజయాన్ని కొనియాడటం జరిగింది.

అయితే బ్రిటన్ లో కొంతమంది మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు బహిరంగంగానే భారత్ పై అక్కసు వెళ్లగక్కారు.

‘జాబిల్లి దక్షిణ ధ్రువం పైకి రాకెట్లను పంపించేలా అంతరిక్ష
రంగంలో పురోగతి సాధించిన దేశాలకు బ్రిటన్ ఆర్థిక
సాయం అందించాల్సిన అవసరం లేదు’ అని ఆ దేశానికి
చెందిన సోఫీ అనే జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు
పెట్టారు. జీబీ న్యూస్ కు చెందిన మరో మీడియా ప్రెజెంటర్
మాట్లాడుతూ.. ‘రూల్ ప్రకారం.. జాబిల్లికి అవతలివైపు
రాకెట్లను ప్రయోగించే మీరు(భారత్).. విదేశీ సాయం కోసం
మావద్దకు రావొద్దు. అంతేగాక మేమిచ్చిన 2.3 బిలియన్
పౌండ్లను మాకు తిరిగిచ్చేయాలి’ అని వ్యాఖ్యానించారు. దీంతో వీరిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 200 ఏళ్లు భారత దేశాన్ని పాలించిన యూకే.. తమ నుంచి దోచుకున్న మొత్తం 45 ట్రిలియన్ డాలర్లను తిరిగిచ్చేయాలంటూ నెట్టింట, సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ’45 ట్రిలియన్లు’ అనే పదం
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

భారత్ కు చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త ఉత్సా పట్నాయక్ ఇటీవల కొలంబియా యూనివర్సిటీ ప్రెస్ లో బ్రిటన్ భారత్ నుంచి 45 ట్రిలియన్ డాలర్లను దోచుకెళ్లిందని ప్రకటించారు. ప్రస్తుత బ్రిటన్ జిడిపి కంటే ఇది 15 రెట్లు. దీంతో ఇప్పుడు భారతీయ పౌరులు బ్రిటన్ తీసుకువెళ్లిన 45 ట్రిలియన్ డాలర్లను తిరిగి ఇచ్చేయాలని సోషల్ మీడియాలో బ్రిటన్ కు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.

అంతేకాకుండా చంద్రయాన్ 2 విఫలమైనప్పుడు బీబీసీ యాంకర్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చంద్రయాన్ 3 తర్వాత వైరల్ అవుతున్నాయి. భారత్ లో పేదరికం ఎక్కువగా ఉందని, మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని, అటువంటప్పుడు చంద్రయాన్ లాంటి ప్రయోగాలపై డబ్బులు ఎందుకు పెట్టడం అని అప్పట్లో యాంకర్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్రా చంద్రయాన్ 3 విజయం తర్వాత ఆ వీడియో కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 200 ఏళ్ల బానిసత్వం ఫలితమే పేదరికమని చురకలు అంటించారు. వీటి నుంచి ఇప్పుడే కోలుకుంటున్నామని తెలిపారు.

చంద్రయాన్ 3 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నటువంటి భారత్ ను చూసి అక్కసు వెళ్ళకక్కేటటువంటి వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలను ఇస్రో అందుకోవాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!