రోజు నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగితే మంచిదని మనం వింటూ ఉంటాం. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అలా తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? తాగితే ఎంత మోతాదులో నీళ్లు తాగాలి? పూర్తి డీటెయిల్స్ మీకోసం
రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే మనం నిద్రలేవగానే మొదట చేయాల్సిన పని ఏంటంటే ఒక గ్లాస్ నీళ్లు తాగటం. ఇది అన్ని విధాలుగా చూసినట్లయితే ఆరోగ్యానికి మంచే చేస్తుంది తప్ప చెడు మాత్రం చేయదు.
ఎందుకంటే రాత్రంతా మనం నిద్రపోవడం వలన నీరు తక్కువగా తాగుతాం. తద్వారా శరీరం కొంతమేర డీహైడ్రేషన్ కి గురవటం సహజం.
కాబట్టి ఉదయం లేవగానే మనం రెండు గ్లాసులు నీళ్లు తాగితే శరీరం మొత్తం తిరిగి హైడ్రేట్ అయ్యి ఉత్తేజం అవుతుంది. మనిషి కి పోషకాహారం కంటి నిండా నిద్ర ఎంత అవసరమో నీరు తాగటం కూడా అంతే ముఖ్యం. శరీరంలో దాదాపు 60 శాతం నీరు ఉంటుంది. మన బ్రెయిన్ అయితే ఏకంగా 80% నీటితో నింపి ఉంటుంది. శరీర అవయవాల పనితీరు బాగుండాలన్న, చర్మ సౌందర్యం బాగుండాలన్న, బరువు తగ్గాలన్న నీరు అన్నిటికంటే చక్కని పరిష్కారం అని మనం భావించాలి.
ఉదయాన్నే నీళ్లు తాగడం వలన ప్రయోజనాలు ఏమిటి?
రాత్రి అంతా నిద్రలో ఉండటం వలన నీరు తగినంత తీసుకోలేకపోవడం సహజం కాబట్టి ఉదయం నీరు తాగడం వల్ల శరీరం అంతా రీ హైడ్రేట్ అవుతుంది.
ఉదయాన్నే నీళ్లు తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
ఉదయాన్నే నీళ్లు తాగడం వలన మన శరీరంలో ఉన్నటువంటి చెడు పదార్థాలు మలమూత్ర విసర్జనాలతో వెళ్లిపోతాయి.
జీర్ణ ప్రక్రియ మెరుగుపడటం మరియు మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఆకలితో పాటు అరుగుదల బాగా మెరుగుతుంది.
అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు కూడా ఉదయాన్నే నీళ్లు తాగటం వలన వాటిని అదుపులో ఉంచే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
ఉదయాన్నే నీళ్లు తాగడం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడిని అదుపులో ఉంచడానికి నీళ్లు తాగడం అవసరం.
మనిషి ఏకాగ్రత, శారీరిక పనితీరు, రోజంతా యాక్టివ్ గా ఉండటం వంటివి కేవలం మీరు తాగే ఒక గ్లాసు నీటితో ముడిపడి ఉంటుందంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
మరి నీరు పరగడుపునే తాగాలా? వెచ్చని నీరు తాగాలా?
అవును ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్రష్ చేయకుండానే నీటిని తాగడం అన్నిటికంటే ఉత్తమం.
అయితే కొంచెం నీరు ముందుగా నోట్లో వేసుకొని పుక్కిలించి బయటకు ఊసేసిన తర్వాత, గ్లాస్ నీటిని మీరు తాగితే మంచిది.
కొంతమంది బరువు తగ్గటానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె వంటివి పిండుకుని తాగుతారు. ఇది కూడా మంచి పద్ధతి.
ఉదయాన్నే మీరు తాగే నీరు గోరువెచ్చని నీరు అయితే ఇంకా మంచిది.
సాధారణంగా రోజులో ఎంత మోతాదులో నీరు తాగాలి?
రోజు మూడు లీటర్ల మేర నీరు తాగడం ఎంతైనా అవసరం.
అయితే వేసవికాలంలో కొంచెం ఎక్కువ నీరు తాగుతుంటాం చలికాలంలో కొంచెం తక్కువ నీరు తీసుకుంటాం. ఏ కాలమైనా కనీసం మూడు లీటర్ల నీరు ప్రతిరోజు తాగటం మంచిది.
U.S. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ మరియు మెడిసిన్ సూచనల మేర : పురుషులకు రోజుకు 15.5 కప్పుల (3.7 లీటర్లు) నీరు లేదా ద్రవం . మహిళలకు రోజుకు దాదాపు 11.5 కప్పుల (2.7 లీటర్లు) నీరు లేదా ద్రవం అవసరమని పేర్కొనడం జరిగింది.
ఏది ఏమైనా నీరు మనకు జీవనాధారమైనప్పటికీ అతి సర్వత్ర వర్జఎత్ అనే నానుడి ప్రకారం అతిగా నీరు తీసుకోవడం కూడా ప్రమాదకరమే. రోజుకి 8 లీటర్లు నీరు మించితే అది కిడ్నీల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిమితిలో నీరు సేవిస్తే, ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే ఒకటి లేదా రెండు కప్పులు నీరు తాగితే ఎంతో మేలు జరుగుతుందనేది వాస్తవం.
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే కింది కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి.