దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది.
ఏకకాలంలో తెలుగు మరియు హిందీలో నిర్మితమైన ఈ మూవీ వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఈ సినిమా పై విడుదల చేసిన టీసర్ తో చాలా నెగిటివిటి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని అధిగమిస్తూ భారీ మార్పులతో ట్రెయిలర్ రిలీజ్ అయింది.
సర్వత్రా ట్రైలర్ పై చాలా మంచి టాక్ నడుస్తోంది. విడుదల అయిన 20 నిమిషాల్లోనే హిందీ లో మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఇక తెలుగు లో కూడా ఏమాత్రం తగ్గకుండా వ్యూస్ వస్తున్నాయి.
కొన్ని గంటల్లో ఈ ట్రైలర్ కోట్లలో వ్యూస్ రాబట్టడం నిజంగా అద్భుతం. అదేవిధంగా సర్వత్రా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
దర్శకుడు ఓం రౌత్ ను గతంలో విమర్శించిన వారు కూడా ప్రస్తుతం సారి చెప్పడం కొసమెరుపు. ఏదేమైనా ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.