గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో స్థాపించబడిన భారత ఐటీ దిగ్గజ సంస్థ HCL తొలి దశలో భాగంగా 4500 మంది ఉద్యోగాలను కల్పించింది.
ప్రస్తుతం రెండో దశ విస్తరణలో భాగంగా హెచ్ సి ఎల్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ మరియు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ తో మంత్రి నారా లోకేష్ అమరావతిలో బేటి అయ్యారు.
రెండో దశలో భాగంగా చేపట్టే విస్తరణ కి సంబంధించిన చర్చ వీరి మధ్య జరిగింది. ఫేస్ 2 లో భాగంగా మరో 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనునట్లు సమాచారం. ఇదే జరిగితే ఐటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అమరావతి యువతకు ఇది గొప్ప న్యూస్ అనే చెప్పవచ్చు.
అన్ని అనుమతులు మరియు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి అన్ని తోడ్పాటు అందిస్తామని మంత్రి నారా లోకేష్ హెచ్ సీ ఎల్ బృందానికి హామీ ఇచ్చారు.