మనం ప్రతి ఏటా ఫిబ్రవరి 14 న జరుపుకుంటున్నటువంటి వాలెంటైన్స్ డే యొక్క మూలం పురాతన రోమన్ కాలం నాటిది అని చెప్పవచ్చు. అసలు ఈ రోజు ఎలా పుట్టింది అనే దానిపై మనకు ఎన్నో కథలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఒకానొక ముఖ్యమైన స్టోరీ ఏంటంటే, మూడవ శతాబ్దంలో రోమన్ రాజు Claudius II ఉండేవాడు. అతను ఒక చట్టాన్ని రూపొందించాడు. యవ్వనంలో ఉన్నటువంటి యువకులకు పెళ్లి కాకుండా ఈ చట్టాన్ని రూపొందించడం జరుగుతుంది. తద్వారా వారు గొప్ప సైనికులు గా, ఎటువంటి బరువు బాధ్యత లేకుండా తమ బాధ్యతను నిర్వహిస్తారని ఆయన నమ్మడం జరిగింది. అయితే అదే సమయంలో St. Valentine అనే క్రిస్టియన్ ప్రబోధకుడు ఉండేవారు. ఆయన రాజుకు తెలియకుండా సీక్రెట్ గా యువకులకు పెళ్లిళ్లు జరిపేవాడు.
ఒకరోజు ఈ విషయాన్ని గ్రహించిన రాజు ఆయనకు మరణ దండన వేస్తాడు. ఫిబ్రవరి 14వ తేదీన ఆయనను చంపి వేయడం జరుగుతుంది. అయితే యువ ప్రేమికులను కలపడం కోసం మాత్రమే St. Valentine ఈ పని చేశాడు అని గ్రహించిన ప్రజలు, కాల క్రమేణా ఈ దినాన్ని ప్రేమికుల దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
మరొక కథ ఏంటంటే, రోమన్ సామ్రాజ్యంలో Lupercalia అనే ఒక పండుగను జరుపుకునేవారు. ఈ పండుగను ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరుపుకునే వారిని చెబుతారు. ఈ పండుగను సంతాన సాఫల్య పండుగ అని కూడా పిలిచేవారు. ఈ సమయంలో యువకులు ఒక మేకను మరియు కుక్కను బలి ఇచ్చేవారు. ఆ తర్వాత వీటి చర్మంతో కోరడాలు చేసి స్త్రీలను కొట్టేవారు. ఈ విధంగా చేస్తే వారికి సంతాన సాఫల్యం కలుగుతుందని వారు నమ్మేవారు. అయితే కాలక్రమేణా ఈ పండుగను సెయింట్ వాలెంటైన్ చనిపోయిన దినానికి అనుసంధానం చేస్తూ, దీనికి ప్రేమికుల రోజు గా పేరు పెడుతూ క్రస్తవ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రేమకు చిహ్నంగా మరియు St. Valentine ప్రేమికులను కలిపేందుకు చేసిన త్యాగానికి ప్రతీక గా ఈ వాలెంటైన్స్ డే ను జరుపుకుంటారు.
కాలంతో పాటు ఈ పండుగలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి, 19వ శతాబ్దంలో దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చింది. అలా ప్రేమికులకు కూడా ఒకరోజు గా దీన్ని యావత్ ప్రపంచం భావించడం జరిగింది. ప్రేమికుల రోజును ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు జరుపుకుంటాయి.