బిజీ బిజీగా ! వరుస ఆఫర్లు తో సునీల్…. భారీ రెమ్యునరేషన్ తో తగ్గేదెలే..

టాలీవుడ్ లో ఒకప్పటి  మోస్ట్ వాంటెడ్ మరియు స్టార్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో కమెడియన్ సునీల్ కూడా ఒకరు గా అందరికీ సుపరిచితమే . అయితే సునీల్ పూర్తి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. ఇతడు భీమవరంలో జన్మించాడు. సునీల్ కేవలం కమెడియన్ గానే కాక  కథానాయకుడిగా మరియు మంచి డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.    ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సునీల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ ఇటు టాలీవుడ్ లోను, అటు కోలీవుడ్లో బాగా బిజీ అయిపోయారు…. ఇక పుష్ప పార్ట్ 1 లో సునీల్ చేసిన విలన్ పాత్రకి మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో సునీల్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస ఆఫర్లు తో దూసుకెళ్తున్నారు….

సునీల్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎంతో కష్టపడి పాపులారిటీ సంపాదించి, కెరీర్  పీక్స్ లో ఉన్న టైంలో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే సునీల్ హీరోగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “అందాల రాముడు”. ఇందులో కథానాయకగా కుర్ర కారు కలలు రాణి  అయినా ఆర్తి అగర్వాల్ నటించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రజాధరణను పొందాయి.. మరి ముఖ్యంగా  అందాల రాముడు సినిమాలోని పాటలకు సునీల్ నృత్యాలు అప్పటిలో ట్రెండ్ ను సృష్టించాయి ..ఈ చిత్రం విజయవంతంగా నడిచి సునీల్ కు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన  “మర్యాద రామన్న” సినిమా కూడా ఎంతగానో ప్రజాదరణను పొందింది. ఆ తర్వాత వచ్చిన పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, కృష్ణాష్టమి,జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు.

ఈ నేపథ్యంలో… సునీల్  స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొంది. హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడనే చెప్పవచ్చు…. దీంతో మళ్లీ టాలీవుడ్ లో కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు..సునీల్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా బాగా బిజీ అయ్యాడు.. టాలీవుడ్ లో ఎంతో కష్టపడి కమెడియన్ గా ఎదిగాడు సునీల్ .. కెరీర్ పిక్స్ లో ఉండగానే హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ను కాస్త డిస్టర్బ్ చేసుకున్నాడు… హీరోగా సునీల్ అంతగా సక్సెస్ అవ్వలేకపోయాడు..తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సునీల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు.

అయితే తెలుగు కంటే తమిళంలోనే  ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు సునీల్.. తమిళంలో కూడా కమెడియన్ గా అలానే విలన్ గా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.. సునీల్ బేసిగ్గా తెలుగు వాడైనా తెలుగు సినిమాల్లో నటించడానికి మునుపటిలాగా మంచి పాత్రలు  రావడం లేదు. ఇలాంటి టైం లో కోలీవుడ్ నుంచి సునీల్ కు మంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.. తమిళంలో ఇటీవల సునీల్ నటించిన “జైలర్” సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.. అంతకుముందు శివ కార్తికేయన్ హీరోగా నటించిన “మహావీరన్” సినిమాలో విలన్ గా నటించి సునీల్ ప్రేక్షకులను మెప్పించాడు.. తాజాగా జైలర్ సినిమాతో సునీల్ కోలీవుడ్ లో కూడా స్టార్ గా మారాడు. “జైలర్” సినిమాలో సునీల్ పాత్ర తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. దీంతో సునీల్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి..ఇక లేటెస్ట్ మూవీ అయినా “మార్క్ఆంటోనీ” లో కూడా సునీల్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.. సునీల్ పారితోషకం కూడా భారీగా పెరిగినట్లు సమాచారం….

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో రోజుకు 30 వేల రూపాయలు తీసుకుంటున్న సునీల్ తమిళంలో సుమారు 60 వేల రూపాయలు పారితోషకం గా రోజుకు తీసుకుంటున్నట్లు సమాచారం… ఇంత పెద్ద మొత్తంలో దర్శక నిర్మాతలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.. రానున్న రోజుల్లో ఈ రొమ్మునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఏది ఏమైనా కమెడియన్ గా హీరోగా తన కెరీర్ను స్టార్ట్ చేసిన సునీల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page