త్వరలో ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న తెలుగు హీరోయిన్ శ్రీదివ్య!!.. వరుడు ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లు హవా నడుస్తోంది… బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు హీరో, హీరోయిన్ లు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు… ప్రస్తుతం టాలీవుడ్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి కి అంతా సిద్దమైంది!!…ఇక ఇప్పుడు మరొక తెలుగు హీరోయిన్ “శ్రీదివ్య” ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది… తాజాగా!! ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ , పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది…

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన తెలుగు అమ్మాయి శ్రీదివ్య, మారుతీ దర్శకత్వం వహించిన ‘బస్ స్టాప్’ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది… ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది… మూవీ సక్సెస్ అయినప్పటికీ ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు లభించలేదు!!.. ఆపై తెలుగులో ఆమె కేరింత సినిమాలో నటించారు… శ్రీదివ్య  తెలుగు అమ్మాయి అయినప్పటికీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు…

శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన “వరుత్తపడాద వాలిబర్ సంఘం” మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది… ఈ మూవీ సక్సెస్ కావడంతో శ్రీదివ్య ఆతర్వాత తమిళ సినిమాల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది… ఈ బ్యూటీ కాక్కీ సట్టై , జీవా, ఈటీ, ముదురు, బెంగుళూరు, నాట్కల్, పెన్సిల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం విక్రమ్ ప్రభు “రైడ్” సినిమాలో హీరోయిన్గా చేసింది… త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది!!.. ఈ సందర్భంగా ప్రమోషన్ లో పాల్గొన్న శ్రీదివ్య ని ప్రేమ, పెళ్లి గురించి రిపోర్టర్ ప్రశ్నించగా!!.. దీనికి బదులుగా శ్రీదివ్య ఆసక్తికరంగా సమాధానమిచ్చింది… “త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అది కూడా ప్రేమ వివాహమే నా ప్రియుడ్నే పెళ్లి చేసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. ఎవరబ్బా అబ్బాయి? పెళ్లెప్పుడు అంటూ నేటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *