శ్రీ లీల కి మరో క్రేజీ ఆఫర్ !.. సినిమాలకు బ్రేక్ ఇస్తున్న శ్రీ లీల… అప్పుడే ఇతర హీరోయిన్లకు ఛాన్స్!

పెళ్లి సందడి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. తన లుక్స్, గ్లామర్ , టాలెంట్ తో మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని  ఏర్పరుచుకోగలిగింది….  టాలీవుడ్ లోనే నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది….   ఏ సినిమా ప్రకటన జరిగిన ముందుగా శ్రీ లీల  పేరే వినిపిస్తుంది. ఆమె సినిమా నుండి తప్పుకుంటే గాని మరో హీరోయిన్ కు అవకాశం దక్కడం లేదు.   ప్రస్తుతం 10 సినిమాలతో కెరీర్ ని వేగవంతంగా సాగిస్తుంది.   ఇక సినిమా సినిమాకి భారీగా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతుంది…

శ్రీ లీలా నటించిన “పెళ్లి సందడి” మరియు  “ధమాకా” ఈ రెండు సినిమాలు హిట్  కావడంతో శ్రీ లీలా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది…..    పెళ్లి సందడి కి ఆమె తీసుకున్న రెమ్యునరేషన్   రూ 5 లక్షలు కాగా ప్రస్తుతం అప్ కమింగ్ మూవీస్ కి రూ  5 కోట్లు డిమాండ్ చేస్తుందంటేనే    తెలిసిపోతుంది శ్రీ లీలా డిమాండ్ ఇండస్ట్రీలో ఎంత భారీగా పెరిగిందో…     మేకర్స్ కూడా ఆమె అడిగినంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈమె క్రేజ్ నానాటికి పెరిగిపోతుంది…

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామకి మరో బంపర్ అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.      ప్రభాస్  సరసన    శ్రీ లీలకు నటించే అవకాశం వచ్చిందని సమాచారం.   ప్రస్తుతం ప్రభాస్ కల్కి అనే ఫాంటసీ, యాక్షన్ మూవీలో నటిస్తున్నారు.    కాగా ఈ సినిమా పూర్తయిన వెంటనే  మరో సినిమా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.    ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది  !    అయితే ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలను సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది!    ఈ విషయంపై త్వరలో ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం…    అయితే ఈ సినిమా  కోసమే శ్రీ లీల ఇద్దరు స్టార్ హీరోల సినిమాల నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది!..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో శ్రీ లీలఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే!….   అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి శ్రీ లీల తప్పుకున్నట్లు తెలుస్తుంది… ఇప్పటికే చాలా సినిమాలు తో బిజీగా ఉన్నా శ్రీ లీల డేట్ సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం!…. అలాగే ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా వదులుకుంది.       ధమాకా తర్వాత ఈ కాంబినేషన్లో మరో సినిమా ప్రకటించారు.   రవితేజ గోపిచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిసిందే!….    మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో మొదట శ్రీ లీలను అనుకున్నారు దర్శక నిర్మాతలు అయితే ఈ సినిమా నుండి ఆమె ప్రస్తుతం తప్పుకున్నట్లు తెలుస్తుంది…. 

దీంతోపాటు శ్రీ లీల మరో క్రేజీ ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేసింది….   అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2  అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే!…..    ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.   ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించేందుకు శ్రీ లీలను పుష్ప -2    టీం అడిగారట అయితే శ్రీ లీల మాత్రం   ఇంత   బిజీ షెడ్యూల్ మధ్య డేట్స్ కుదరక ఆమె ఈ సాంగ్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది!….

అందం అభినయంతో అందరినీ అలరిస్తున్న  శ్రీ లీలా ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది….     తెలుగులో ఈమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే  మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా – “గుంటూరు కారం” ,  పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ ల – “ఉస్తాద్ భగత్ సింగ్”  తో పాటు బాలయ్య-     ” భగవంత్ కేసరి ” లో కూడా ఈమె నటిస్తుంది.   ఇందులో ఆమె బాలయ్యకు కుమార్తెగా నటిస్తుంది.    ఇక “గుంటూరు కారం”  చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది !….

ఈ నేపథ్యంలో   శ్రీ లీల రెండు నెలల పాటు అన్ని సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలుస్తుంది…   పది సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉన్నా ఈమె సినిమాలతో పాటు స్టడీస్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది…   శ్రీనిల ప్రస్తుతం చదువుకుంటూనే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.    ఈ నేపథ్యంలో ఆమె నవంబర్ ,  డిసెంబర్ నెలలో మాత్రం సినిమాలకు బ్రేక్ ఇవ్వనన్నట్లు తెలుస్తుంది.     ఈమె ప్రస్తుతం MBBS లాస్ట్ ఇయర్ చదువుతుంది!…..      ఈ సంవత్సరంతో ఆమె తన డిగ్రీని పూర్తి చేస్తుందట.     ఇందుకోసమే రెండు నెలలు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది…..

వరుస క్రేజీ ఆఫర్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీ లైఫ్ ని గడుపుతున్న శ్రీ లీలా సినిమాలను వదులుకుంటే గాని మిగిలిన వారికి అవకాశం దక్కడం లేదు.     ఇక  రవితేజతో శ్రీ లీల వదులుకున్న సినిమాలో ప్రస్తుతం లక్కీగా రష్మిక మందన్న  వచ్చి చేరింది!….  ఇక శ్రీనిల తప్పుకోవడం తోనే ఆ ప్లేస్ లోకి నేషనల్  క్రష్   రష్మిక వచ్చి చేరిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది!…..  

ఇక రానున్న 6 నెలల్లో ప్రతినెల శ్రీ లీల నటించిన ఒక్కో సినిమా విడుదల కానుంది.    ముందుగా రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న “స్కంద” మూవీ సెప్టెంబర్- 28 విడుదల కానుంది.   ఆ తర్వాత బాలయ్య భగవంత్ కేసరి అక్టోబర్ – 19న రానుంది….  తర్వాత వైష్ణవ తేజ్ “ఆదికేశవ”  నవంబర్- 10న వస్తుంది.    నితిన్, వక్కంతం వంశీ ‌ “ఎక్స్ట్రా  – ఆర్డినరీ మ్యాన్”  మూవీ డిసెంబర్ -23న విడుదల కానుంది!….  ఇక మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న  “గుంటూరు కారం” సంక్రాంతి కానుకగా జనవరి-  12న విడుదల కానుంది…..  ఇలా ప్రతి నెల ఆమెను నటించిన సినిమాలలో ఒక్కొక్క సినిమా  సందడి చేయనుంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page