మొదటి సారి విడాకుల విషయం లో నోరు విప్పిన సమంత. రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్

అగ్ర కథానాయక సమంత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైవాహిక బంధంలో తాను పూర్తి నిజాయితీగా ఉన్నానని, కాకపోతే అది వర్కౌట్ కాలేదని అన్నారు. అయితే “శాకుంతలం” ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సమంత తన వ్యక్తిగత జీవితం పై ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఇందులో భాగంగా “పుష్పా”లో ఐటమ్ సాంగ్ చేయడం పైన స్పందించారు. ఐటమ్ సాంగ్ చేయొద్దన్నారు!!!

వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికి నాకు పుష్పాలో “ఉ అంటావా” ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చింది . నే నే తప్పు చేయనప్పుడు ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలని పించింది ఆ పాటను అనౌన్స్ చేసినప్పుడు. నేనే తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలని అనిపించింది. వెంటనే దాన్ని ఓకే చేసేశాను. “ఊ అంటావా మామా” పాటను అనౌన్స్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు, తెలిసినవాళ్లు ఫోన్ చేసి ఇంట్లో కూర్చో చాలు విడిపోయిన వెంటనే నువ్వు ఐటెం సాంగ్స్ చేయడం బాగోదు, అని సలహాలు ఇచ్చారు‌. నన్ను ఎప్పుడు ప్రోత్సహించే స్నేహితులు కూడా ఆ పాటను చేయొద్దనే అన్నారు. కానీ నేను దాన్ని అంగీకరించలేకపోయాను. ఎందుకంటే… వైవాహిక బంధం లో నేను 100% నిజాయితీగా ఉన్నాను. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. అటువంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కోవాలి? నేను చేయని నేరానికి నన్ను నేను మానసికంగా హింసించుకొని ఎందుకు బాధపడాలి? నేను ఇప్పటికే ఎన్నో బాధలు పడ్డాను.

రెమ్యునరేషన్ ఎంతంటే

నేను నటించిన ఏ సినిమాకి రమ్యునరేషన్ గా ఇంత కావాలని నేనెప్పుడూ డిమాండ్ చేసింది లేదు. మీకు ఇంత మొత్తం చెల్లిస్తామంటూ వారు వచ్చి చెబుతుంటారు. అంతేకానీ ఇంత ఇవ్వాలని నేను ఎప్పుడూ అభ్యర్థించను. మన ప్రతిభ మీదనే మనకి ఎంత చెల్లించాలని నిర్ణయించి ఉంటుంది .అంతకుమించి డిమాండ్ చేసిన వర్కౌట్ అవ్వదు కేవలం కృషితోనే ఇది సాధ్యమవుతుందని ఆమె తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page