Salaar: ‘సలార్’ రిలీజ్ డేట్ లో మార్పు? షాక్ లో డార్లింగ్ ఫ్యాన్స్!.. కింగ్ ఖాన్ తో పోటీ…..

డార్లింగ్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా “సలార్ ” ఈ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ మరియు మూవీ లవర్స్ ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ మూవీలో శ్రుతి హసన్ కథానాయిక, అయితే ఈనెల 28న రిలీజ్ కావాల్సిన మూవీ పోస్ట్ పోన్ కావడం ప్రభాస్ ఫాన్స్ ను ఎంతో నిరుత్సాహ పరిచింది. మరియు షాక్కు గురి చేసింది. సలార్ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్న సమాచారంను ప్రకటించిన నిర్మాతలు… కొత్త రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. దీంతో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన చాలా రిలీజ్ డేట్స్ నెట్టింటా హల్చల్ చేస్తుండడంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మరియు టెన్షన్ పడుతున్నారు.. దాంతో దాంతో వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని ఇటీవల వార్తలు వచ్చాయి….

అయితే తాజాగా సలార్ మూవీ రిలీజ్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింటా ట్రెండ్ అవుతుంది. ఈ వార్త సారాంశం ఏమనగా “సలార్ పార్ట్ 1″ ‘డిసెంబర్ 22న” రిలీజ్ అవుతుందని వార్త నెట్టింటా తెగచెక్కర్లు కొడుతోంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు “సలార్” మూవీ డిసెంబర్ 22న రిలీజ్ అని పోస్ట్ పెట్టడమే దీనికి కారణం. దీంతో ప్రభాస్ అభిమానులు మరియు పలు వెబ్సైట్లు కూడా “సలార్ “మూవీ డిసెంబర్లో రిలీజ్ అవుతుందని ట్విట్టర్లో పోస్ట్లు పెడుతున్నారు. మరికొందరు ప్రభాస్ ఫ్యాన్స్ రిలీజ్ డేట్ తో తయారు చేసిన పోస్టర్ను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు..

మరోవైపు ఈ చిత్ర దర్శకుడైన ప్రశాంత్ నీల్ భార్య అయినా లిఖిత రెడ్డి నీల్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో 2023 డిసెంబర్ మంత్ ఎప్పటిలాగా ఉండదు ఆ మంత్ కోసం ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న అని పెట్టిన పోస్టు “డార్లింగ్ ప్రభాస్ “ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో డిసెంబర్లో “సలార్” డేట్ ఫిక్స్ అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇంకా మూవీ మేకర్స్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు..

ఇకపోతే డిసెంబర్ 22 కు ముందు రోజే బాలీవుడ్ స్టార్ హీరో “షారుక్ ఖాన్” నటించిన నటించిన “డంన్కి “మూవీ కూడా ఇదే రోజున విడుదల కానుంది.. ఈ మూవీకు సక్సెస్ఫుల్ మూవీస్ కు డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హీరానీ దర్శకత్వం చేస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలకు పోటీ తప్పదనే అనిపిస్తుంది.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ మాట్లాడుతూ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకమైనది జనవరి రిపబ్లిక్ డేకు పఠాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. సూపర్ హిట్టు అందించారు. అలాగే కృష్ణాష్టమి కి “జవాన్” ను రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక క్రిస్మస్ కు డంన్కిగా రానున్నాను. ఆ మూవీ ని కూడా తప్పక ఆదరిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నానని చెప్పారు.. దీంతో డిసెంబర్ 22 ఆసక్తికరంగా మారి సినీ అభిమానులను ఊర్రుతలూగించనుందని తెలియ వస్తుంది. ఒక సినీ అభిమానులకు పండగే పండగ. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉండగా!!! ప్రభాస్ షారుక్ కు జరిగే బ్యాటిల్ లో గెలుపు ఎవరిదో వేచి చూడాలి మరి ఏమవుతుందో!??????.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page