శాకుంతలం 3డీ ట్రైలర్ వచ్చేసింది. సమంత శాకుంతలం రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం “శాకుంతలం”. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అయినా ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ “రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు

3డీ ట్రైలర్ లాంచింగ్

ఈ మూవీ 3డీ ట్రైలర్ ను మార్చి 28న సాయంత్రం ఐదు గంటలకు లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించారు‌ మేకర్స్. ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ – 6 లో ఈ లాంచింగ్ ఈవెంట్ ఉండనున్నట్లు తెలియజేశారు. అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందుకునేందుకు రెడీగా ఉండండి అంటూ కొత్త అప్డేట్ తో విడుదల చేసిన పోస్టర్ … ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ నేపథ్యంలో మైథాలజికల్ డ్రామాగా శాకుంతలం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు శకుంతలగా స్టార్ హీరోయిన్ గాసామ్స్ అదేనండి మన హీరోయిన్ సమంతా నటిస్తోంది. అనన్య నాగళ్ళ అతిధి మోహన్, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇదొక దృశ్య కావ్యం. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒక్కటైనా శాకుంతలం కథకు గుణశేఖర్ గారు ప్రాణం పోశారు ‌ బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రం ఇది.

సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడి ఫైనల్ గా ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి.

అయితే ఇప్పటికే ఆ తేదీలో పలు చిత్రాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ‘బోలా శంకర్’ సినిమా కూడా ఉంది. రజినీకాంత్ ‘జైలర్ ‘చిత్రం కూడా రానుందని టాక్ వినిపిస్తోంది మరియు ‘ఉగ్రం’ అనే సినిమా, లారెన్స్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రుద్రుడు’కూడా ఉన్నట్లు సమాచారం. మరి ఇన్ని సినిమాల పోటీలో గుణశేఖర్ ఈ తేదీనే ఎందుకు ఎంచుకున్నారనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సమంతా అయితే ఈ చిత్రంపై ధీమాగా ఉన్నారు.

ఈ చిత్రంలోని నటీనటులు

ఈ చిత్ర నిర్మాణంలో నటీనటులు శకుంతల గా -సమంత రూత్ ప్రభు, దుష్యంతుడుగా – దేవ్ మోహన్, దూర్వాసమునిగా – మోహన్ బాబు గారు, అల్లు అర్హ – ప్రిన్స్ భారత గా, ప్రకాష్ రాజ్, వర్షిని సౌందరాజన్, కబీర్ సింగ్ దుహ, అదితి బాలన్, కబీర్ బేడి, అనన్య నాగళ్ళ ప్రధాన తారాగణంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page