క్రేజీ ఆఫర్ కొట్టేసిన ఏజెంట్ బ్యూటీ… ఈసారైనా లక్కు మారేనా?

“విజయ్ దేవరకొండ” హీరోగా “గౌతమ్ తిన్ననూరి” డైరెక్షన్లో  ప్రతిష్టాత్మకంగా ఒక మూవీ ను నిర్మిస్తున్నారు… ప్రస్తుతం ఈ మూవీను ‘వీడి-12’ గా పిలుస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నటి “శ్రీలీల”హీరోయిన్గా నటిస్తుందని నిర్మాత ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే!!. ఇటీవల జరిగిన ‘మ్యాడ్’ సినిమా ప్రమోషన్ లో కూడా ఈ విషయాన్ని రివీల్ చేశారు…అయితే!! ప్రస్తుతం ఈ వీడి 12 గా పిలుస్తున్న చిత్రంలో నటీనటుల్లో మార్పులు కనిపిస్తున్నాయి…

అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం హీరోయిన్ శ్రీలీలా ప్లేస్లో ఇన్స్టా  రీల్స్ తో ఏజెంట్ మూవీ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ముంబై బ్యూటీ  “సాక్షి వైద్యను” హీరోయిన్ గా తీసుకున్నారన్న వార్త టీ టౌన్ లో హల్చల్ చేస్తుంది… దీనికి కారణం విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కారణంగా గౌతమ్ తిన్ననూరి మూవీ షూటింగ్ ఆలస్యం కానుంది.. అందువలన జనవరి తర్వాత  కొత్త డేట్స్ ను ఈ సినిమా షూటింగ్ కోసం కేటాయించే స్థితిలో శ్రీ లీల లేనట్లుగా, అంతేకాక శ్రీ లీల తన MBBS ఎగ్జామ్స్ కోసం సినిమాల నుండి కాస్త విరామం తీసుకోనుందని టాలీవుడ్ నుండి సమాచారం…. కనుక మేకర్స్ ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యం కాకూడదని ఏజెంట్ హీరోయిన్ అయినా “సాక్షి వైద్యను” ప్రధాన పాత్రలో హీరోయిన్ గా  తీసుకున్నట్లు సమాచారం… దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన  ఉండగా..

ఇన్స్టా రీల్స్ తో ఏజెంట్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబై బ్యూటీ సాక్షి వైద్య తెలుగులో మరొక బిగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్  ఇచ్చినట్లు తెలుస్తోంది…   దీంతో సాక్షి  వైద్య కు జాక్పాట్ తగిలిందని టీ టౌన్ టాక్.. అయితే సాక్షి వైద్య నటించిన ఏజెంట్ మరియు అర్జున గాండీవ దారి సినిమాలు రెండు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి….

ఇక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ  మాఫియా, డ్రగ్స్ తో కలకలం సృష్టిస్తున్న రౌడీలను గుండాల పని పట్టి వారిని అంతమందించె యాక్షన్ అండ్ డైనమిక్  పోలీస్ ఆఫీసర్ గా  కనిపించనున్నాడు… ఇక ఈ VD12 మూవీను గౌతం తిన్ననూరి డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి… విజయ్ దేవరకొండ హీరోగా ఈ భారీసినిమా సక్సెస్ అయితే ముంబై బ్యూటీ అయిన సాక్షి వైద్యకు తిరుగుండదని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page