HBD Sai Dharam Tej: “స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాదు!!.. మాస్ మ్యాన్ “గాంజాశంకర్” టీజర్ విడుదల…

సుప్రీం హీరో “సాయి ధరమ్ తేజ్” తన తర్వాత సినిమాను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే!!!…  మాస్ డైరెక్టర్ “సంపత్ నంది”  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు…  స్టూడియోస్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.. అయితే!!  తాజాగా ఈ మూవీ  ‘అక్టోబర్ 15’ ‘సాయి ధరమ్ తేజ్’  పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా “టైటిల్” , అండ్ “ఫస్ట్ లుక్”  టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్….

సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లో ’17వ సినిమా’ గా వస్తున్న ఈ ప్రాజెక్టుకు “గాంజా శంకర్”  అనే టైటిల్ని ఫిక్స్ చేశారు మేకర్స్…  టీజర్ చాలా మాస్ గా ఉంది, సాయిధరమ్ తేజ్ కూడా ఇప్పటివరకు ఎన్నడూ కనిపించనంత మాస్గా ఈ సినిమాలో కనిపించనున్నాడని ఈ డిజిటల్ వ్యూస్  చూస్తేనే తెలిసిపోతుంది…   దీంతో సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే మరో మాస్ హిట్ కన్ఫామ్ అంటూ తన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు….  ఇక ఈ సినిమాకు బీమ్ సిసి రోలియో సంగీతం అందిస్తున్నారు.

అయితే సాయి ధరమ్ తేజ్ బర్త్డే సందర్భంగా టైటిల్ను అనౌన్స్ చేస్తూ వీడియో గ్లింప్స్ ని వదిలారు. ఈ చిత్రానికి   “గాంజాశంకర్” అని టైటిల్ ఖరారు చేస్తూ మాస్ కి నిర్వచనం ఇవ్వద్దని ,ఫీల్ అవ్వమని చెబుతూ గాంజా శంకర్ వీడియో గ్లీంప్స్ ప్రారంభమవుతుంది.. అయితే ఈ వీడియోలో “స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాదు నాన్న మన లోకల్  మ్యాన్ ” కథ ఏదైనా ఉంటే చెప్పు అని ఓ చిన్నారి అడగడంతో “గాంజా శంకర్” కథ మొదలౌతుంది‌.

ఈ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ మెగా అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. హీరో పాత్ర ఎలా ఉండబోతుందో ఈ ఇంట్రోను చూస్తేనే తెలిసిపోతుంది .”గంజాయి” అనే పేరు చెప్పలేదు కానీ హీరో  ‘గాంజా’ అమ్ముతాడని విషయాన్ని మాత్రం ఈ వీడియో ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్ ..మొత్తానికి ఈ మూవీ ద్వారా సాయిధరమ్ తేజ్ ని పూర్తి మాస్ కథాంశంతో రూపొందుతున్న పాత్రలో కొత్తగా కనిపించబోతున్నాడని మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు!!… శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది ఎస్ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page