గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC15 నుంచి కీలక అప్డేట్.. ఏంటో చూసేయండి

సౌత్ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC 15 నుంచి అప్డేట్ వచ్చేసింది ‌. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రెస్టీజియస్ మూవీ టైటిల్ కు స్పెషల్ వీడియో ద్వారా రివీల్ చేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న మూవీRC15. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నRC15 షూటింగ్ ఆల్మోస్ట్ దగ్గర పడింది. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్లో మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న మేకర్స్… తాజాగా టైటిల్ రివీల్ చేశారు. ఈరోజు (మార్చ్ 27) రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ రిలీజ్ చేసినా మోషన్ పోస్టర్ వీడియోలో Rc15 టైటిల్ ను ఆర్భాటంగా ఉత్సాహంగా ప్రకటించారు. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వెయిటింగ్ ను స్టాప్ చేస్తూRC15 చిత్రానికి “గేమ్ చేంజర్”అనే టైటిల్ను తెలియజేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ వీడియోలో ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు.

మొత్తానికి మోషన్ పోస్టర్ వీడియో ద్వారా టైటిల్ ను రివీల్ చేశారు‌ మొదటినుంచి చెప్తున్నట్లుగా ఈ మూవీ ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తుండగా‌… అసెంబ్లీ హాల్లో చదరంగం మాదిరిగా, సెంటర్లో రాజును సింబాలిక్ గా చూపిస్తూ డిజైన్ చేసిన మోషన్ పోస్టర్ వీడియో అదిరిపోయింది. తెలుగు ప్రేక్షకులను ఊహిస్తోంది. దీనికి థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా మరో ప్రపంచాన్ని తలపించే విధంగా వేరే లెవల్లో ఉండబోతుంది.

ఇక ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అయినా “గేమ్ ఛేంజర్”… శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేయగా.. ఈరోజు (మార్చి27) మధ్యాహ్నం 03:06 గంటలకు విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే, రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు రెండు రోజుల ముందేRC15 మూవీ సెట్స్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

RRR తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ ఘనంగా ప్లాన్ చేశారు ‌… ఆదివారం నిర్వహించిన వేడుకల్లో బాబాయి నాగబాబు పాల్గొని మాట్లాడారు. ఈ వేదికగా హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతుంది.

One response to “గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC15 నుంచి కీలక అప్డేట్.. ఏంటో చూసేయండి”

  1. Sk khajavai avatar
    Sk khajavai

    Nice information madem Inka update s unte pettandi madem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page