” PROJECT-K ” ప్రభాస్ నుండి ఫస్ట్ లుక్… రికార్డులు బద్దలుకొడుతూ!

ఆది పురుష్ తర్వాత ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ప్రాజెక్ట్ కే” ….నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. వైజయంతి బ్యానర్ పై ఈ మూవీ ను నిర్మిస్తున్నారు . ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ఈ సినిమాపై ఉన్నాయి‌‌. ఈ మూవీపై చాలా అంచనాలు ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టుకొని ఉన్నారు… కాగా “ప్రాజెక్ట్ కె” సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ”శాండీయాగో కామిక్ కాన్” ఈవెంట్లో పాల్గొననున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.. అమెరికాలో జరగనున్న “శాండీయాగో కామిక్ కాన్ ” ఈవెంట్లో “ప్రాజెక్ట్ కె” టీం అంతా పాల్గొననుంది …ఈ ఈవెంట్ కు హాజరుకానున్న తొలి భారతీయ సినిమాగా “ప్రాజెక్ట్ కె” రికార్డు సృష్టించింది..

ఈవెంట్ జూలై 20వ తేదీన జరగనుంది ..ఈ నేపథ్యంలో మూవీ టీం అమెరికా చేరుకుంటోంది. ఇప్పటికే ప్రభాస్ అమెరికాలోనే ఉన్నారు. ‘ఆది పురుష్’ రిలీజ్ కి ముందే అమెరికా వెళ్లారు. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇండియా వస్తారని అనుకున్నారు …కానీ ఇప్పుడు ఈవెంట్ కోసం ఆయన అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది .ఈవెంట్ అయిన తర్వాతే ప్రభాస్ మళ్లీ స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది..

అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం “ప్రభాస్” తో పాటు “రానా” కూడా అమెరికా కు వెళ్ళటం విశేషాన్ని సంతరించుకుంది..

వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోని తాజాగా వైజయంతి మూవీస్ షేర్ చేసింది అమెరికాలో ల్యాండ్ అయ్యారు అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటుంది. కాగా ప్రభాస్ హాలీవుడ్ స్టార్ లా ఉన్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు…

కాగా ఈ మూవీలో అమితాబచ్చన్, దీపిక పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని లాంటి అగ్ర తారలు నటిస్తుండటం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.‌. ఇదిలా ఉండగా “శాండియాగో కామిక్ కాన్”ఈవెంట్ కు దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, దీపికా పదుకొనే ,కమల్ హసన్, రానా హాజరుకానున్నారు. ఇదే వేదికపై ఈ సినిమా టైటిల్, టీజర్ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. మరి ఈ మూవీతో అయినా “ప్రభాస్” హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి..

అయితే ఇవాళ మధ్యాహ్నం అనగా జూలై 19 నా 13:23 గంటలకు ఈ సినిమాలోని ‘ప్రభాస్ ఫస్ట్ లుక్’ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది …ఈనెల 20వ తేదీన అమెరికాలోని “శాండీయాగో కామిక్ కాన్” వేదికపై ‘ప్రాజెక్ట్ కే’ సినిమా టైటిల్ను రివిల్ చేయనున్నారు.. ఇవాళే ‘ప్రభాస్ లుక్’ బయటకు రానుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు… ‘ప్రభాస్ లుక్’ మరియు ‘ప్రాజెక్ట్ కే’ సినిమా టైటిల్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page