ప్రభాస్”ప్రాజెక్ట్ కే” నుండి బిగ్ అప్డేట్… ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” కి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఫస్ట్ గ్లింప్స్ తేదీ ఖరారు అయింది.

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ప్రాజెక్ట్ కే’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికాపదుకొనే, దిశా పటాని కూడా నటిస్తుండడంతో ఈ సినిమా కోసం భారత సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. శాన్ డియాగో కామిక్ కాన్ 2023 లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్ గ్లింప్స్ విడుదల తేదీ ఖరారైంది.

అమెరికాలో ఈ నెల 20న ఇండియాలో 21న టైటిల్ గ్లింస్ విడుదల కానున్నాయి 20న శాన్ డియాగో కామిక్ కాన్ లో జరిగే ఈ వేడుకకు ప్రభాస్ కమలహాసన్ దీపికా పదుకొనే నాగశ్విన్ చిత్ర నిర్మాతలు హాజరు కానున్నారు భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా వచ్చేయడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

One response to “ప్రభాస్”ప్రాజెక్ట్ కే” నుండి బిగ్ అప్డేట్… ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే!”

  1. Sk.khajavali avatar
    Sk.khajavali

    Nice information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page