ఎట్టకేలకు డార్లింగ్ “ప్రభాస్” కు పెళ్లి!! ఫ్యాన్స్ ఖుషీ… అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ!!!…

పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ “ప్రభాస్” పెళ్లి చేసుకుంటే చూడాలని వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రభాస్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు… ఇండస్ట్రీలోని హిందీ హీరోలు సైతం వివాహం చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు!!!… కానీ సీనియర్ హీరో అయిన ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మిగిలిపోయాడు…. తాజాగా దసరా ఉత్సవాల సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ పెద్దమ్మ గారైన” శ్యామలాదేవి” ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ను ఇచ్చారు….

ఇటీవల ప్రభాస్ , అనుష్క వివాహం అయ్యి ఒక బాబు కూడా పుట్టినట్లు క్రియేట్ చేసి పలువురు ఫ్యాన్స్ AI ఫోటోస్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు…. దీన్నిబట్టి అర్థమవుతుంది ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని ఎంతగా కోరుకుంటున్నారో…. ప్రభాస్, అనుష్క జోడి చాలా చూడముచ్చటగా ఉంటుందని!!.. వారిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…. అయితే ఆ కోరికను ప్రభాస్ ఫ్యాన్స్ AI పిక్చర్స్ ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అయినా ప్రభాస్ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహ పడుతున్నారు.

కొద్దిరోజుల క్రితం ఆదుపురుష్ సినిమా హీరోయిన్ అయినా కృతి సనన్ తో లవ్ లో ఉన్నారంటూ డార్లింగ్ ప్రభాస్ ఫై వార్తలు జోరుగా వినిపించాయి…. కానీ !! వాటిపై కూడా ప్రభాస్ ,కృతి సనన్ స్పందించకపోవడంతో ఈ రూమర్స్ సద్దుమణిగాయి.

ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే!!! ఈ నేపథ్యంలో తాజాగా దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ “శ్యామలాదేవి” గారు విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్ళింది… అక్కడ తను మీడియా కంట పడటంతో మీడియా వారు పలు ప్రశ్నలు అడిగారు. అయితే “శ్యామలాదేవి” గారు చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు…. కృష్ణం రాజుగారు మాతో లేకపోయినా ఆయన పేరును నిలబెట్టడానికి మా ఫ్యామిలీ ముందుకు వెళుతుంది అని తెలిపారు…. ఇక రెబల్ స్టార్ “డార్లింగ్ ప్రభాస్” పెళ్లి ప్రస్తావన తీసుకురాగా “”త్వరలోనే ప్రభాస్ వివాహం చేసుకుంటాడు”” అని సమాధానం ఇచ్చారు.

ఇంతలో కొందరు విలేకరులు అమ్మాయి ఎవరు అని అడిగారు దానికి సమాధానం గా శ్యామలాదేవి గారు అమ్మాయిని కూడా ఇంకా అనుకోలేదు, పెళ్లి తేదీ కూడా తెలియదు గానీ ఆరోజు త్వరలోనే వస్తుంది…. తప్పకుండా వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటి వాడవుతాడని శ్యామలాదేవి గారు చెప్పుకొచ్చారు… దీంతో ఫ్యాన్స్ ఎగిరి గంతులు వేస్తున్నారు. మరి అమ్మాయి ఎవరబ్బా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్, ఇండస్ట్రీలోని వారంతా తెగ కన్ఫ్యూజ్ లో పడిపోయారు. చూడాలి మరి ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియాలంటే వచ్చే దసరా వరకు ఆగాల్సిందే!!!…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page