“మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” మూవీ రివ్యూ : అనుష్క, నవీన్ హిట్టు కొట్టారా!…

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మరియు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నేడు థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్లలోకి విడుదలయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది…

అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క శెట్టి తన గ్లామర్ తో మరియు అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించిందిఅనే చెప్పుకోవాలి. ఈ మూవీలో తన పాత్ర కు అనుష్క శెట్టిచాలా బాగా న్యాయం చేసింది… ఆమె స్క్రీన్ పై గ్లామర్ గా కనిపించడమే కాకుండా పవర్ ఫుల్ కం బ్యాక్ ఇచ్చింది. ఇక తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే తనకు తగిన పాత్రలో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించాడు.అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, ఇతర నటినట్లు తమ పాత్రలకు ఎంతగానో న్యాయం చేశారు. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది.మూవీ మేకింగ్ విలువలు చాలా బాగున్నాయి..

ఈ మూవీలో సూటిగా మరియు ఛాలెంజింగ్ గా ఉండే కాన్సెప్టును చూపించడం జరిగింది. దర్శకుడు మహేష్ బాబు పి చాలా అద్భుతంగా మరియు సున్నితంగా చిత్రీకరించారు…

ఇక కథ విషయానికి వస్తే అన్విత రవళి శెట్టి ( అనుష్కశెట్టి) లండన్ కు చెందిన మాస్టర్ చెఫ్.. ఆమె వివాహం లేకుండాతల్లి కావాలని నిర్ణయించుకుంటుంది ఆమె గర్భం కోసం తన భాగస్వామిగా స్టాండప్ కమెడియన్ అయినా సిద్దు పోలిశెట్టి ( నవీన్ పోలిశెట్టి) నీ ఎంచుకుంటుంది. సిద్దు పోలిశెట్టి ఆమె ఆశయాలను, ఉద్దేశాలను పట్టించుకోకుండా, ఆమె ప్రేమలో పడిపోతాడు. ఆమె అసలు ఉద్దేశం తెలిసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు. అయితే తల్లి కావాలి అని అనుష్క కలను సాకారం చేయడంలో అతను ఆమెకు సహాయం చేస్తాడా!! అసలు తన జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకునేలా అన్వితను ప్రేరేపించిన సంఘటన ఏమిటి?అనేది స్టోరీ లైన్…..

స్టోరీ ను సింపుల్ గా, చక్కగా ఎలివేట్ చేసినప్పటికీ కొంచెం లేగ్ ఉన్నట్లు అనిపించింది.. దర్శకుడు కొంచెం వేగం పెంచి ఉండొచ్చు.. అనవసరమైన సన్నివేశాలతో ఫస్ట్ ఆఫ్ కొంత స్లోగా ఉంది అనిపిస్తుంది.

కథలో మరింత ఎమోషనల్ డెప్త్ ను చూయించి ఉంటే పాత్రలతో ప్రేక్షకుల అనుబంధం మరింత బలపడే అవకాశం ఉండేది. మురళీ శర్మ, సోనియా దీప్తి, చేసిన పాత్రలకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది.

రైటర్ & దర్శకుడు మహేష్ బాబు పి తన దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అనే చెప్పవచ్చు. ఈ చిత్రంతో తన బెస్ట్ అవుట్ పుట్ ను చూపించాడు. అయితే స్క్రీన్ ప్లే పై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది..

రధన్ సౌండ్ ట్రాక్ లో మూడు పాటలు ఉన్నాయి.అవి చాలా బాగున్నాయి. గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇక నీరవ్ షా సినిమాటోగ్రఫీ ఒక రేంజ్ లో ఉంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఇంకా చాలా బాగుంది. నిర్మాణం విలువలు అద్భుతంగా ఉన్నాయి

మొత్తం మీద మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఈ సినిమాలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ల పర్ఫామెన్స్ లు చాలా బాగున్నాయి ఎమోషన్స్ సన్నివేశాలు,కామెడీ సన్నివేశాలు అన్ని ప్రేక్షకులను కట్టిపడి వేశాయని చెప్పవచ్చు.. అయితే ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ లోనూ మరియు సెకండ్ హాఫ్ లోను కొన్ని సన్నివేశాలు స్లోగా సాగాయి. వీటిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోతే ఈ సినిమాను ఎంతగానో ఎంజాయ్ చేయవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page