మహేష్ బర్త్ డే కి భారీ సర్ప్రైజ్… ఫ్యాన్స్ కోరిక తీరుతుంది.

ఏడాది నుంచి టాలీవుడ్ లో రీరిలీజ్ ల హంగామా నడుస్తుంది. ఇటీవలే “పవన్ కళ్యాణ్” సినిమా “తొలిప్రేమ” ఎలాంటి సందడి చేసిందో తెలిసిందే అసలు రీ రిలీజ్ హంగామా శ్రీకారం చుట్టుకుందే మహేష్ బాబు సినిమా “పోకిరి”తో గత ఏడాది ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు ను పురస్కరించుకొని, సూపర్ స్టార్ ఫ్యాన్స్ “పోకిరి” స్పెషల్ షోలతో మామూలు హడావుడి చేయలేదు….. అప్పటిదాకా రీరిలీజ్ అంటే ఏదో ఐదో పదో థియేటర్లలో షోలు వేసేవారు.

కానీ పోకిరి చిత్తానికి మాత్రం వందల్లో షోలు ప్లాన్ చేశారు కలెక్షన్లు కూడా అనూహ్యంగా రూ. 2 కోట్లకు దగ్గరగా వచ్చాయి. . మహేష్ అభిమానులు చూసి మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ లోను ఉత్సాహాన్ని మరియు పంతాన్ని నింపింది.అందరూ ఆ ట్రెండ్ ను అనుసరిస్తున్నారు. మహేష్ అభిమానులు సైతం తర్వాత “ఒక్కడు” స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. దానికి మంచి స్పందనే వచ్చింది.

అయితే “సూపర్ స్టార్ ఫ్యాన్స్” లో ఎక్కువమంది రీ రిలీజ్ కోరుకుంటున్నా సినిమా “బిజినెస్ మ్యాన్” అనే చెప్పాలి. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ పాత్ర మామూలుగా ఉండదు. చాలా ఫెరోషియస్ గా, పవర్ ఫుల్ గా, పూర్తి వైవిధ్యంగా నెగిటివ్ షేడ్స్ లో కనిపించే ఆ పాత్రను మహేష్ అభిమానులు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. “సూర్యాభాయ్” ఎప్పుడు చర్చనీయాంసంగానే ఉంటూ ఉంటాడు.

సినిమా అంతా మహేష్ వన్ మ్యాన్ సోలా కనిపించే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలన్న అభిమానుల కోరిక తీరాబోతోంది. ఈసారి మహేష్ ‘పుట్టినరోజుకు’ ఆ చిత్రాన్ని స్పెషల్ షో లుగా వేయబోతున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది.ఇది సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మంచి ఉత్సాహాన్నిస్తోంది . అయితే ఆగస్టు 9న బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ను సూపర్ స్టార్ ఫ్యాన్స్ అట్టహాసంగా ప్లాన్ చేస్తున్నారు.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ జోడిగా నటించిన “బిజినెస్ మ్యాన్ “మూవీ 4k లో రీ రిలీజ్ కానుంది. మహేష్ బర్త్డే సందర్భంగా ‘ఆగస్టు 9న’ ప్రేక్షకులను అలరించనుంది. సూర్య భాయ్ గా మహేష్ తమన్ అoదించిన మ్యూజిక్ సినిమాకి హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. 2012 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ సెన్సేషన్ హిట్ సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page