బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “జవాన్” రివ్యూ! షారుఖ్, నయన్, విజయ్ సేతుపతి అదరకొట్టేసారు…

ఎట్టకేలకు అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నా”జవాన్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అలాగే ప్రేక్షకులు ఈ మూవీ పై పెట్టుకున్న ఆశల కు ఏమాత్రం తీసుపోకుండా ఉన్నట్లు ఈ “జవాన్” మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, టిక్కెట్ల విక్రయాలను బట్టి స్పష్టంగా అర్థం అవుతుంది. అదేవిధంగా థియేటర్లు మొత్తం షారుక్ అభిమానులతో నిండిపోయి ఒక పండగ వాతావరణం కనబడుతూ ఉంది.

జవాన్ మూవీ రివ్యూస్

అయితే ఈ చిత్రం “షారుక్” కు ఈ సంవత్సరంలో రెండవ మూవీ. ఈ “జవాన్” మూవీ లో “షారుక్” ను మునుపెన్నడు చూడని షేడ్స్ ల లో చూపించాడు ఈ మూవీ దర్శకుడైన “అట్లీ”. ఈ మూవీలో షారుక్ తో పాటు లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార, విజయసేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, యోగిబాబు,సునీల్ గ్రోవర్, సిమర్ జీత్ సింగ్ నాగ్రా, అజి భాగ్రియ, మన్హర్ కుమార్, మొదలగు నటీనటులు ప్రధాన తారాగణంగా నటించారు. అంతేకాక బాలీవుడ్ కి మోస్ట్ క్రెజియస్ట్ లేడీ స్టార్ అయిన “దీపికా పదుకొణే “ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించారు..

ఈ మూవీ ట్రైలర్ లాంచ్ సమయంలో షారుక్ తన అభిమానులకు ఒక ఫుల్ ప్యాకెడ్- యాక్షన్ థిల్లర్ ను అందిస్తానని హామీ ఇచ్చిన విధంగానే ఏమాత్రం తీసిపోకుండా ఈ మూవీ సూపర్ గా ఉంది. ఈ “జవాన్ “మూవీ 100 కోట్ల బాక్సాఫీస్ ఓపెనింగ్ మార్కును అందుకోగా!! ఓవర్సీస్ మార్కెట్ నుండి రూ :40 కోట్లు, దేశీయ మార్కెట్ నుండి 60 కోట్లు వస్తాయని బాక్స్ ఆఫీస్ అన్లిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ “జవాన్” మూవీ షారుక్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా ఒక మైలురాయి లాగా నిలుస్తుంది. “జవాన్” మూవీని చూసిన అభిమానులు సినిమా థియేటర్లలో నృత్యాలు చేస్తున్నారు… థియేటర్ల అన్నీ మరియు కౌంటర్లు ముందర అభిమానులతో కోలాహలంగా నిండి ఉన్నాయి.

నయనతార మరియు విజయ్ సేతుపతి ఎవరికి వారు వారి క్యారెక్టర్లలో పోటీపడి నటించారు. మరియు విజయ్ సేతుపతి ఇంటర్నేషనల్ ఆర్మ్స్ డీలర్ గా చేసిన యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పించాయని చెప్తున్నారు. కింగ్ ఖాన్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు.. తన లోని వేరియేషన్లను అన్ని చూపిండం తో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. మరియు “అనిరుధ్ ” నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు.. అతని బ్యాగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉందని చెప్పవచ్చు…

ఈ ఏడాది “పఠాన్” సినిమాతో బ్లాక్ బస్టర్ను అందుకున్న “కింగ్ ఖాన్ షారుక్ అంతకు మించి జవాన్ లెక్కలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే “పఠాన్” అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్ సేల్స్ ను జవాన్ దాటవేసింది.. 5.57 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. “పఠాన్” సినిమాకు 5.56 లక్షల టికెట్లు విక్రయించారు. ప్రస్తుతం “జవాన్ మేనియా” నడుస్తోంది అని తెలుస్తోంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page