“జవాన్ ” మొదటి రోజు కలెక్షన్స్… కింగ్ ఖాన్ భీభత్సం ! రికార్డ్ బ్రేక్ కింగ్….

అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం “జవాన్” సెప్టెంబర్ 7న థియేటర్లకు వచ్చింది ఊహించినట్లుగానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది….. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం ‘పఠాన్’ ఏకంగా రూ.1000 కోట్లను కొల్లగొట్టింది.    ‘పఠాన్’ తొలి రోజున భారత్ లో రూ.  55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 100  కోట్లకు పైగా నెట్ కలెక్షన్ వసూలు చేసింది.    అయితే ఇప్పుడు ‘పఠాన్’ రికార్డులను తిరగరాస్తూ “జవాన్” చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు… ‘జవాన్’ సినిమా విడుదలైన తొలిరోజే సూపర్ హిట్ టాక్ రావడంతో షారుక్ ఖాన్ ఖాతాలో మరో విజయం నమోదయింది… దీంతో జవాన్ తొలిరోజే భారీ వయసులను రాబట్టింది.

షారుక్ ఖాన్ తన కెరీర్ లో ఇప్పటివరకు అత్యధిక వసూలు రాబడిన చిత్రం పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది ప్రస్తుతం జవాన్ కూడా రూ. 1000 కోట్లను సులభంగా దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

జవాన్ రిలీజ్ అయిన మొదటి రోజే భారతదేశంలో అత్యధికంగా రూ. 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది..

ఈ మూవీ ట్రైలర్ లాంచ్  సమయంలో షారుక్ తన అభిమానులకు ఒక ఫుల్ ప్యాకెడ్- యాక్షన్ థిల్లర్ ను అందిస్తానని హామీ ఇచ్చిన విధంగానే ఏమాత్రం తీసిపోకుండా ఈ మూవీ సూపర్ గా ఉంది.

అయితే ఈ చిత్రం “షారుక్” కు  ఈ సంవత్సరంలో రెండవ మూవీ. ఈ “జవాన్” మూవీ లో “షారుక్” ను మునుపెన్నడు చూడని షేడ్స్ ల లో చూపించాడు ఈ మూవీ దర్శకుడైన “అట్లీ”. ఈ మూవీలో షారుక్ తో పాటు లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార, విజయసేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, యోగిబాబు,సునీల్ గ్రోవర్, సిమర్ జీత్ సింగ్ నాగ్రా, అజి భాగ్రియ,  మన్హర్ కుమార్, మొదలగు నటీనటులు  ప్రధాన తారాగణంగా నటించారు. అంతేకాక బాలీవుడ్ కి మోస్ట్ క్రెజియస్ట్ లేడీ స్టార్ అయిన “దీపికా పదుకొణే “ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page