“గాడ్” మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!!.. నయనతార సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్…

లేడీ సూపర్ స్టార్ ‘నయనతార” , స్టార్ హీరో “జయం రవి” అహ్మద్ దర్శకత్వంలో నటించిన చిత్రం “ఇరైవన్”. సైకలాజికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయిన ఈ మూవీని తెలుగులో “గాడ్” పేరుతో రిలీజ్ చేశారు…ఈ సినిమా సెప్టెంబర్ 28 విడుదలైన సంగతి తెలిసిందే!!.. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు… ఇక ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది… రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఓటిటి తేదీని ఖరారు చేశారు… ఇక ఆ వివరాలు ఏందో చూద్దాం!!!…

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ” నెట్ ఫ్లిక్స్” లో అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది… ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది… ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, చార్లీ, అశ్విన్ కుమార్, రాహుల్ బోస్, విజయలక్ష్మి, వినోద్ కిషన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు…

సినిమా కథ:

నగరంలో సైకో కిల్లర్ అనేకమంది యువతుల్ని కిడ్నాప్ చేసి వారిని అత్యంత పాషవికంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతుంటాడు… దీంతో సైకో కిల్లర్ని పట్టుకునేందుకు ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ ( జయం రవి) బృందం రంగంలోకి దిగుతుంది… అయితే కిల్లర్ ని అర్జున్ పట్టుకుంటాడు… కానీ పట్టుకున్న తర్వాత కూడా హత్యలు జరుగుతూనే ఉంటాయి… మరి వాళ్లను ఎవరు చంపుతున్నారు? మర్డర్ మిస్టరీలను ఎలా చేదించాడు? ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని తనేలా పరిష్కరించారు? తెలియాలంటే “గాడ్” సినిమాను ఓటీడీలో చూడాల్సిందే!!.. చూడాలి మరి “గాడ్” చిత్రం ఓటిటి ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకోనుందో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *