హరితేజ కొత్త ఫిజిక్ గురించి సోషల్ మీడియా లో మెదలైన ట్రోల్స్.

ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోను మహా చలాకీగా ఉంటుంది. సినిమాల్లో తన యాక్టింగ్ తో అలరించే ఆమె బుల్లితెర షోలలో తనదైన పంచ్ డైలాగ్ లతో కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాదు సటైరికల్ కామెంట్స్ తో ఇంచుమించు మరో సూర్యకాంతంలా పేరు సంపాదించుకుందంటూ ఓ ఈవెంట్ లో ఏకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్న విషయం తెలిసినదే. అలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది. మొదటి సీజన్లో పార్టీసీపెంట్గా వెళ్లి మంచి పేరు సంపాదించుకుంది ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అ ఆ”చిత్రంలోని మంగమ్మ పాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.ఆ తరువాత ఆమెకు తిరుగులేదు అనుకున్నారు అందరూ. కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. అటు తిరిగి సీరియల్స్ వైపు కూడా వెళ్లలేకపోయింది.

ఇక 2021లో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన హరితేజ సోషల్ మీడియాలో ఫాన్స్ ని పలకరిస్తుంది ‌. తన ఫోటోలు కూతురు ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. ఈ క్రమంలో ఆమె షాకింగ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆఫర్స్ లేక ఇంటికే పరిమితమైన హరితేజ బరువెక్కిన సంగతి తెలిసిందే. అయితే సడన్ గా ఆమె బక్క చిక్కి కనిపించింది. తాజాగా తన లంగా వోణి ఫోటోలు షేర్ చేయగా….. అందులో చాలా సన్నగా కనిపించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఇక హరితేజను ఇలా చూసి ఆమె ఫాలోవర్స్ అంతా అవాక్కవుతున్నారు. సడన్ గా ఇంత చేంజ్ ఏంటి????.. ఆమె పోస్ట్ పై స్పందిస్తున్నారు..

అంతేకాదు ఆమె డైట్ ప్లాన్ ఏంటని కూడా ఆరా తీస్తున్నారు ఇలా అస్సలు బాలేవు… కాస్త బొద్దుగానే ఉంటే బాగున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు ఇలానే చాలా అందంగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇదంతా మరోసారి కమ్ బ్యాక్ ఇచ్చేందుకే రెడీ అయింది అని అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page