దసరా సినిమా కి సంబంధించిన ఇన్ ట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం.

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ “దసరా” ఎస్ .ఎల్. వి సినిమా బ్యానర్ పై ‌ శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ దస్కత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నాని కెంతో ప్రత్యేక మనే చెప్పాలి. మరీ ముఖ్యంగా రెండు విషయాల్లో అందులో ఒకటి “దసరా” పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతుంది….. ఇక రెండో పాయింట్… ఏంటంటే ఇప్పటివరకు నాని తన కెరీర్లో నటించని స్టైల్ లో రా అండ్ రెస్టిక్ గా చేసిన సినిమా ఇదే. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ,పాటలు ,అందులో నాని లుక్, కీర్తి సురేష్ క్యారెక్టర్, సినిమాను తెరకెక్కించిన విధానం, బ్యాక్ డ్రాప్, ఇలా అన్ని సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేస్తున్నాయని చెప్పుకోవచ్చు.

నాని రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. నాని ఈ సినిమా కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల ను పారితోషకంగా తీసుకున్నారని టీ టౌన్ సమాచారం తెలుస్తుంది ‌. “దసరా” సినిమా హిట్టుతో ఇకపై నాని అంటే కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు కచ్చితంగా పాన్ ఇండియా స్టార్ గా కూడా దూసుకుపోతాడని నాని ఫ్యాన్స్ తొడగొట్టి కాలర్ ఎగరేస్తున్నారు ‌.

రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ మూవీ మార్చి 30వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ,భాషలలో విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను ప్రపంచవ్యాప్తంగా అమ్మివేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో తెలుసుకుందాం .

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

నైజాం ఏరియాలో ఈ మూవీకి 13. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, సి డెడ్ లో 6.5 కోట్లు, యు .ఏ లో 3.9 కోట్లు, ఈస్ట్ లో 2.35 కోట్లు ,వెస్టు లో 2 కోట్లు, గుంటూరులో 3 కోట్లు, కృష్ణాలో 2 కోట్లు, నెల్లూరులో 1.2 కోట్లు, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ మూవీకి 34.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.కర్ణాటకలో ఈ మూవీకి 2.85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, ఇతర భాషలలో 1.5 కోట్లు, నార్త్ ఇండియాలో 5 కోట్లు, ఓవర్సీస్ లో 6 కోట్లు, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా…….. ఈ సినిమా 51 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో వేచి చూడాలి.

నాని కామెంట్స్ ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నాచురల్ స్టార్ నాని దసరా తో మీ గుండెల్ని హత్తుకునే మాస్ చూపిస్తానని తెలియజేశారు. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అని తెలిపారు. టాప్ లేచిపోయే సినిమా మార్చ్ 30వ తేదీన మీకు మేము ఇస్తున్నాం టాప్ లేచిపోయే రెస్పాన్స్ మీరు మాకు ఇవ్వండి అని న్యాచురల్ స్టార్ నాని ప్రేక్షక దేవుళ్ళని కోరారు. ఈ వేడుకలో కీర్తి సురేష్ తో పాటు నాని చార్ట్ బస్టర్ హిట్ సాంగ్ కి డాన్స్ వేశారు . ఈ విధంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలనే రేకెత్తించారు.

ఓటిటి డిజిటల్ రైట్స్

ఇక ఈ సినిమా ఓటిటి రైట్స్ కూడా భారీ ధరను దక్కించుకున్నాయి. తెలుగులో నే కాకుండా, కన్నడ, తమిళం, ఇంకా అలానే మలయాళం భాషలకు చెందిన స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా….. ఇక హిందీ స్ట్రీమింగ్ రైట్స్ ను డిస్నీ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిసి వచ్చిన సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page