ఘనంగా అర్జున్ కుమార్తె నిశ్చితార్థం!!.. కమెడియన్ కొడుకుతో ‘ఐశ్వర్య అర్జున్’ పెళ్లి….

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె, కోలీవుడ్ హీరోయిన్ అయిన “ఐశ్వర్య అర్జున్” త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది…  కోలీవుడ్ దిగ్గజ నటుడైన  కమెడియన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ తంబి రామయ్య కొడుకు “ఉమాపతి”తో ఐశ్వర్య ప్రేమలో ఉందని ఎప్పటినుంచో వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే….

యాక్షన్ కింగ్ అర్జున్ కి ఇద్దరు కుమార్తెలు వీరిలో పెద్దమ్మాయి “ఐశ్వర్య అర్జున్”. అయితే ఐశ్వర్య అర్జున్ 2013లో నటి గా అరంగేట్రం చేసింది!!… మంచి సక్సెస్ ఎక్కడా దొరకలేదు. ఆమె తన నటనతో సినీ ప్రేక్షకులకు పెద్దగా దగ్గర కాలేక పోయింది. తన కుమార్తెను నటి గా నిలబెట్టేందుకు సీనియర్ హీరో అయిన అర్జున్  ఎంతోకాలంగా చేయని ప్రయత్నాలు లేవు. చివరికి తానే డైరెక్టర్ గా మారి కుమార్తెను హీరోయిన్గా పెట్టి సినిమా తీసిన అది కూడా హిట్ అవ్వలేదు!!…  బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం హీరో ఉపేంద్ర అన్న కొడుకుతో హీరోయిన్ గా మరో సినిమాకు ప్లాన్ చేశాడు….

ఇక తమిళ కమెడియన్ తంబిరామయ్య  కొడుకు “ఉమాపతి” 2017లో ‘అడగ పట్టదు మగజనంగాలే’తో అరంగేట్రం చేశాడు. అర్జున్ సర్జా హోస్ట్ చేసిన అడ్వెంచర్ ఆధారిత రియాలిటీ షో “సర్వైవల్” లో కనిపించాడు.  ప్రస్తుతం “దేవదాస్” అనే సినిమాలో నటిస్తున్నాడు… యాక్షన్ కింగ్ అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి పాల్గొనడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది… ఈ క్రమంలో ఉమాపతి ఐశ్వర్యులు ప్రేమలో పడ్డారు అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి ప్రతిపాదన చేశారు…. వీరి కుటుంబ సభ్యుల అంగీకారం లభించడంతో వివాహానికి లైన్ క్లియర్ అయింది.. అయితే తంబి రామయ్య ప్రముఖ హాస్య నటుడిగా, సహాయ నటుడిగాను చాలా తమిళ సినిమాల్లో నటించారు.

ఇటీవలే ఇరు కుటుంబాల అంగీకారంతో ‘ఐశ్వర్య అర్జున్’ మరియు ‘ఉమాపతి’ ల వివాహ నిశ్చితార్థం జరిగింది!!… ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు…; ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తున్నాయి.పలు సెలబ్రిటీలు అలాగే అభిమానులు వీరి ఇద్దరికీ తమదైన శైలిలో విషెస్ తెలియజేస్తున్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *