ఏపీఈసెట్-2023 వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇలా

బీఈ, బీటెక్,బీఫార్మసీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశాలు కల్పించేందుకు ప్రతి ఏటా నిర్వహించే ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈసెట్-2023) వాయిదా పడింది.

జూన్ 20కు వాయిదా

మే 5న నిర్వహించాల్సి ఉన్న ఈ పరీక్షను జూన్ 20కు వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్ చైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు..

  • పాలిటెక్నిక్ చివరి సంవత్సరం పరీక్షలు ఇంకా పూర్తికాకపోవడంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్,రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలను https:// cets. apsche. ap.gov.in/ECET అభ్యర్థులు తెలుసుకోవచ్చు, ఇంకేమైనా సందేహాలకు 85004 04562 నంబరులో సంప్రదించాలని కన్వీనర్ ఆచార్య ఎ. కృష్ణమోహన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!