వైఎస్సార్ వాహన మిత్ర తుది అర్హుల జాబితా విడుదల, చెక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో, ట్యాక్సీ మరియు మ్యక్సి క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్..ఈ నెలాఖరు లో విడుదల కానున్న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి అర్హుల తుది జాబితా ను ప్రభుత్వం విడుదల చేసింది.

2023-24 సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ వాహన మిత్ర దరఖాస్తులను ప్రభుత్వం ఆగస్ట్ 7 వరకు స్వీకరించడం జరిగింది. పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ ఆగస్ట్ 9 నాటికి ముగించింది.

వైఎస్సార్ వాహన మిత్ర Eligible/Ineligible లిస్ట్

వైఎస్సార్ వాహన మిత్ర స్టేటస్ ను కింది ప్రాసెస్ మరియు లింక్ ద్వారా చెక్ చేయండి

✓ ఇక్కడ ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి

Click here for NBM Status

✓ scheme దగ్గర YSR Vahana Mitra అని ఎంచుకోండి

✓ తర్వాత year దగ్గర 2023-24 ఎంచుకోండి

✓ మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న captcha కోడ్ ఎంటర్ చేయండి

✓ తర్వాత Get OTP పైన క్లిక్ చేసి మీ మొబైల్ కి వచ్చే OTP ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలు చూపిస్తాయి.

ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారాన్ని కింద ఇవ్వడం జరిగింది.

వైయస్సార్ వాహన మిత్ర పథకం

ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వాహన డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. వాహన మెయింటెనెన్స్ ఖర్చులు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్ వంటి ఇతర డాక్యుమెంట్లు పొందటానికి ప్రభుత్వం డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. ఆటో, ట్యాక్సి, మ్యాక్సి డ్రైవర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. పది వేల రూపాయల ఆర్థిక సాయం పొందొచ్చు.

పేద కుటుంబాలకు చెందిన 18 ఏళ్లకు పైన వయసు కలిగి, ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసం కలిగి, రేషన్ కార్డులో పేరు కలిగిన వారికి స్కీమ్ వర్తిస్తుంది.మరియు ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారికి ఆటో, ట్యాక్సీ కచ్ఛితంగా ఉండాలి.

ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారం మరియు లేటెస్ట్ అప్డేట్స్ కొరకు కింద లింక్ ని క్లిక్ చేయండి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page