వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమౌంట్ ను ముఖ్యమంత్రి ఈరోజు విడుదల చేశారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్ట పోయిన రైతులకు ముఖ్యమంత్రి ఈ నష్టపరిహారాన్ని జమ చేశారు.
అనంతపురం కళ్యాణదుర్గం పర్యటనలో భాగంగా అమౌంట్ విడుదల
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనలో భాగంగా నేడు ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ చేయడం జరిగింది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణదుర్గం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఉచిత పంటల బీమా అమౌంట్, ఈ సారి 10.2 లక్షల మందికి పరిహారం
ఉచిత పంటల బీమా పథకం ద్వారా గత ఏడాది ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నేడు అమౌంట్ జమ చేయడం జరిగింది. ఈసారి మొత్తం 10.2 లక్షల మంది రైతుల ఖాతాలో 1,117.21 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటికే జాబితాలను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా జులై ఐదు వరకు అభ్యంతరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం జరిగింది.
Uchitha Pantala Bheema Released on : July 08 2023
కొత్తగా 52 వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ ప్రారంభించనున్న సీఎం
రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నిర్మించినటువంటి 52 వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంబించారు.
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ కోసం రూ. 213.27 కోట్ల వ్యయంతో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 10 పరీక్ష ల్యాబరేటరీలు, 4 రీజనల్ కోడింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
వైయస్సార్ ఉచిత పంటల బీమా స్టేటస్ ను ఆన్లైన్ లో కూడా చెక్ చేయవచ్చు
వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అర్హత ఉన్న వారి జాబితాను రైతు భరోసా కేంద్రాలతో పాటు ఆన్లైన్లో కింది లింకు ద్వారా కూడా చెక్ చేయండి.
స్టేటస్ చెక్ చేసేటప్పుడు kharif 2022 అని ఎంచుకొని చెక్ చేయగలరు.
లేదా రైతులు తమ ఈ క్రాప్ స్టేటస్ ని కూడా చెక్ చేయవచ్చు. ఈక్రాప్ స్టేటస్ ఆధారంగానే పంటల భీమా కూడా అమలు అవుతుంది.
Leave a Reply