Government launches a new scheme under the name Dr. YSR sanchara pashu arogya seva for the veterinary medical services for cattle across the state of AP
మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం 108 అంబులెన్స్ తరహాలోనే మెరుగైన ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వం తీసుకొస్తున్న డాక్టర్ వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలు (YSR Mobile veterinary ambulance clinic) మే 19 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ పథకం ద్వారా దాదాపు రూ.278 కోట్లతో 340 వాహనాలు కొనుగోలుతో పాటు వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 175 వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ పథకం ద్వారా ప్రస్తుతం మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.142.90 కోట్లతో 175 వాహనాలు, రెండో దశలో రూ.134.74 కోట్లతో మిగిలిన 165 వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
సేవలు ఎలా పొందాలి ?
- పాడి పశువులతో పాటు పెంపుడు జంతువులూ అనారోగ్యానికి గురై నపుడు 1962 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలి
- అంబులెన్సు మీ వద్దకు చేరుకుంటుంది.
- ప్రతి అంబులెన్సు లో ఒక పాసు వైద్యుడు , వెటర్నరీ డిప్లొమా చేసిన ఒక అసిస్టెంట్ , డ్రైవర్ కమ్ అటెండర్ఉంటారు
- వాహనంలో నే 35 రకాల టెస్టులు చేసే ల్యాబ్ సౌకర్యం
- ప్రాథమిక వైద్య సేవలు, మైనర్ సర్జరీలు చేసే వెసులుబాటు కూడా ఉంది.
- వెంటనే పశువుల యజమానులు 1962 కాల్ చేసి ఈ సేవలు పొందవచ్చు
Leave a Reply