ఏపీలో గర్భిణీలు బాలింతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.. వారికి ప్రతి నెల అంగన్వాడి కేంద్రాలలో అందిస్తున్నటువంటి సంపూర్ణ పోషణ మరియు సంపూర్ణ పోషణ ప్లస్ కింద సరుకులను మరియు ప్రస్తుతం అందిస్తున్నటువంటి భోజనానికి సంబంధించిన సరుకులను సైతం జూలై 1 నుంచి నేరుగా ఇంటికే అందించాలని నిర్ణయించింది.
YSR సంపూర్ణ పోషణ ప్లస్+ పథకం 77 షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ సబ్ ప్లాన్ మండలాల్లో అమలు చేయబడుతోంది, రాష్ట్రంలోని మిగిలిన మండలాల్లో YSR సంపూర్ణ పోషణ పథకం అమలు చేయబడుతోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) అనుసంధానం తో 55,607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ICDS ఈ సేవలను అందిస్తుంది. రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో 3.8 లక్షల మంది లబ్ధిదారులు మరియు మిగిలిన మండలాల్లో 26.36 లక్షల మంది లబ్దిదారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.
సంపూర్ణ పోషణ కింద ఏ సరుకులు ఇంటికి అందిస్తారు?
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కింద ఇవ్వబడిన సరుకులను బాలింతలు మరియు గర్భిణీలకు అందిస్తుంది.
- బియ్యం
- కందిపప్పు
- పాలు
- కోడి గ్రుడ్లు
- నూనె
- అటుకులు
- బెల్లం
- ఎండు ఖర్జూరం
వంటి సరుకులను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ పోషణ కిట్ ద్వారా అందిస్తుంది.ప్రతినెల 1-5 తేదీల మధ్య పైన తెలిపిన సరుకులు మరియు రెండో పక్షంలో 16-17 తేదీలలో పాలు, గుడ్లు ఇస్తారు.
ఈసారి జొన్న పిండికి బదులుగా రాగి పిండి
ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్నటువంటి 500 గ్రాముల జొన్న పిండికి బదులు ఇకపై కేజీ రాగి పిండి ని పంపిణీ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. ఈ సరుకులను నేరుగా ఇంటి వద్దకే పంపిణీ చేయనున్నారు.
Leave a Reply