ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది.
జూన్ 1 వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం ఈ ఏడాది మొదటి విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
తొలుత మే 30న రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ తర్వాత జూన్ 1కి వాయిదా వేయటం జరిగింది.
RYTHU BHAROSA DATE : June 1 2023
ఎంత అమౌంట్ జమ అవుతుంది?
ఈ ఏడాదికి సంబంధించి ఈ నెల మొదటి విడత వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ ₹5500 రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో పాటు 2000 PM కిసాన్ అమౌంట్ కూడా కేంద్రం జమ చేస్తుంది. దీంతో మొత్తంగా 7500 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలో జమ చేయనున్నాయి.
మొదటి విడత గా 7500, రెండో విడత 4000 ఇక ఈ నెల మూడో విడత గా 2000 ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.
వైయస్సార్ రైతు భరోసా కోసం కొత్త రిజిస్ట్రేషన్ లను గత నెల నుంచి మే 18 వరకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీరికి కూడా తాజాగా విడుదల కానున్నటువంటి అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
ఇక కేంద్ర ప్రభుత్వం జమ చేసేటటువంటి పీఎం కిసాన్ అమౌంట్ నిధులు గత విడతలో మాదిరిగానే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే జమ అవుతుంది. ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేయని కారణంగా గత విడత అమౌంట్ పడని వారికి ఈ విడత అమౌంట్ తో కలిపి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వైయస్సార్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ స్టేటస్ లింక్స్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి.
Leave a Reply