కళ్యాణమస్తు పథకానికి సంబందించి DA/WEDS login లో new application apply చేసిన తరువాత….
ఇప్పటి నుంచి, పెళ్లికూతురు మరియు పెళ్ళికొడుకు ఇద్దరూ ఏ సచివాలయాలకి సంబందించిన వారో, ఆ సచివాలయాల యొక్క ఇద్దరూ WEAs/WWDS logins కి verification కొరకు application forward అవుతుంది.
అనగా…. DA/WEDS login లో apply చేసిన తరువాత పెళ్ళికూతురు ఏ సచివాలయం కి సంబందించిన వారో ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి, మరియు పెళ్ళికొడుకు ఏ సచివాలయం కి సంబందించిన వారో ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి verification కొరకు forward అవుతుంది.
గతంలో DA/WEDS login నందు apply చేసిన తరువాత, పెళ్లికూతురు ఏ సచివాలయం కి సంబందించిన వారు అయితే ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి application forward అయ్యేది. అయితే ఇప్పటి నుంచి DA/WEDS login లో apply చేసిన తరువాత పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరికి సంబందించిన WEAs/WWDS వారి యొక్క login నందు వెరిఫికేషన్ చెయ్యవలసి వుంటుంది.
పెళ్లి కూతురు మరియు పెళ్ళికొడుకు ఇద్దరు సచివాలయాలకి సంబందించిన WEAs/WWDS verification తరువాత, పెళ్లికూతురు సచివాలయం ఏ mandal సంబంధించినదో ఆ mandal యొక్క MPDO/MC గారి login కిverification కొరకు forward అవుతుంది.
NOTE :
Bride & Bridegroom Different Secretariats :: పెళ్లికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరు కూడా వేరు వేరు సచివాలయాలకి సంబందించిన వారు అయిన సందర్బంలో మాత్రమే ఇద్దరూ WEAs/WWDS కూడా వారి లాగిన్ నందు వెరిఫికేషన్ చెయ్యవలసి ఉంటుంది.
Bride & Bridegroom Same Secretariat : పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరూ కూడా ఒకే సచివాలయం కి సంబందించిన వారు అయితే ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి మాత్రమే application forward అవుతుంది. ఆ సచివాలయం యొక్క WEA/WWDS verification complete చేస్తే సరిపోతుంది.
Application Rejected at Collector level : కళ్యాణమస్తూ పథకానికి సంబందించి సరియైన documents upload చెయ్యకపోవటం వలన Collector గారి login నందు reject చేయబడితే, అటువంటి వారు సరియైన documents తో DA/WEDS login నందు మరల కొత్తగా apply చేసుకోవచ్చు.
Leave a Reply