వై.యస్.ఆర్ బీమా పథకానికి సంబంధించి 02 ఆగస్టు తేదిన రాష్ట్ర స్థాయిలో జరిగిన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ,వార్డు సచివాలయం డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ మరియు అడిషనల్ కమిషనర్ హాజరయ్యారు. ఈ సమావేశం లో భాగంగా కొన్ని ముక్యమైన ఆదేశాలను జారీ చెయ్యడం జరిగింది
- 2023-24 సంవత్సరానికి గాను GIC సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా పరిహారం నేరుగా నామినీకి చెల్లించడం జరుగుతుంది.
- ప్రతి (55) కుటుంబాలకు ఒక వాలంటీరు ఉన్న౦దున, ఏట్టి పరిస్థితిలోను ఎవరైనా వ్యక్తి సహజం / ప్రమాదవశాత్తు మరణించిన 24గ౦.లోగా క్లెయిమ్ నమోదు చెయ్యాలి.
- ఏట్టి పరిస్థితిలోను క్లెయిమ్ 24 గంటలలోపు నమోదు చేసి, రూ.10,000/- లు తక్షణ సహయం అందించాలి. ఈ విషయంలో అలసత్వంతో సకాలంలో క్లెయిమ్ నమోదు చేయకపోతే సంబందిత WEA/WWD’s పై శాఖ పరమైన క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
- నమోదు చేయలేక పోవడానికి ఏదైనా కారణాలు ఉంటే ముందుగా సంబంధింత MPDO/MC మరియు DRDA కార్యాలయంలో తెలపాలి.
- ప్రమాదవశాత్తు మరచించిన వ్యక్తి వివరాలు 10 రోజులలోగా, సహజంగా మరణిస్తే 5రోజులలో అన్ని పత్రాలతో క్లెయిమ్ అప్లోడ్ చేయాలి.
- FIR మరియు పోలీస్ తుది నివేదికల కొరకు మహిళా పోలీస్ సేవలను, పోస్ట్ మార్టమ్ నివేదిక కొరకు ANM సేవలను ఉపయోగించుకోవాలి.
- మరణి౦చిన 24 గంటలలోగా నామినికి Happy Card ద్వారా తక్షణ సహాయం వెంటనే అందజేసి Ekyc ద్వారా నమోదు చేయాలి. Happy card ద్వారా డ్రా చేసిన తర్వాత వెంటనే చెల్లించకపోతే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం క్రింద పరిగణి౦చడం జరుగుతుంది.
కుటుంబంలో Primary Bread Earner చనిపోయిన 24 గంటలలోగా క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయుటకు WEA/WWD’s లు ప్రత్యెక శ్రద్ద చూపించాలి.
Leave a Reply