వైఎస్ఆర్ భీమా పథకానికి సంబంధించి 2023-24 సంవత్సరానికి గాను కొత్త మరియు రెన్యువల్ దరఖాస్తులను వాలంటీర్ల ద్వారా స్వీకరించడం జరిగింది.
మరణించిన పాలసీ దారుల క్లైమ్ రిజిస్టర్ చేయించడానికి సచివాలయం లోని వెల్ఫేర్ అసిస్టంట్ లకు కొత్తగా యాప్ రిలీజ్ చెయ్యడం జరిగింది
వైఎస్ఆర్ భీమా క్లైమ్ రిజిస్ట్రేషన్ సూచనలు
ముందుగా వైఎస్ఆర్ భీమ eKYC యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
లాగిన్ అయ్యాక Claim Registration 2023-24 అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
Claim Registration 2023-24 క్లిక్ చేసి సెర్చ్ బాక్స్ లో 2022-23, 2023-24 అని వస్తాయి.
పాలసీ దారుని మరణ తేదీ 30.06.2023 వరకు ఉంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు death క్లెయిమ్ 2022-23 ఆప్షన్ లో రిజిస్ట్రేషన్ చేయాలి.
ఒకవేళ మరణ తేది 01.07.2023 నుండి అయితే 2023-24 ఆప్షన్ లో క్లెయిమ్ పాలసిదారుని ఆధార్ మరియు రైస్ కార్డ్ తో చెక్ చేసి క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చెయ్యాలి.
ప్రమాదవశాత్తు మరణించిన పాలసీ దారుల క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రమాదం జరిగిన తేది 30.06.2023 వరకు మరియు మరణ తేది 15-07-2023 వరకు 2022-23 నందు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయవలసివుంది. తర్వాత జరిగిన వాటిని 2923-24 ఆప్షన్ ద్వారా రిజిస్టర్ చేయాలి.
Leave a Reply