వైఎస్ఆర్ భీమ పథకానికి సంబంధించిన 20.07.2023 తేదిన GSWS అడిషనల్ కమిషనర్ తో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో చర్చించిన ముఖ్యమైన అంశాలు
వైఎస్ఆర్ బీమా పధకం (2023-2024) కి సంబంధించి Normal Claims 01.07.203 నుండి ప్రారంభం కావడం జరిగింది. 01.07.2023 నుండి జరిగిన Normal క్లైమ్స్ ను (2023-2024) Year లో మాత్రమే నమోదు చేయాలి.
(2023 -2024 ) కి సంబంధించి Accidental Claims 16.07.2023 నుండి ప్రారంభం కావడం జరిగింది. 16.07.2023 నుండి జరిగిన Normal క్లైమ్స్ ను (2023-2024) Year లో మాత్రమే నమోదు చేయాలి. ఈ సంవత్సరం (2023 -2024) General Insurance Company కొత్తగా రావడం జరిగింది. కావున Accidental claims అప్లోడ్ చేసేటప్పుడు కొత్త claim form ఇవ్వడం జరుగుతుంది.
గ్రామ మరియు వార్డ్ పరిధిలో వై.ఎస్.ఆర్ బీమా పాలసీదారుడు సహజంగా లేదా ప్రమదవశాత్తు మరణిస్తే పూర్తి పరిశీలన చేసి 24 గం.లో (WEA/WWDS LOGIN ) నమోదు చేయాలి.
WEA/WWDS లాగిన్ లో నమోదు చేసిన ప్రతి క్లైమ్స్ కి రూ.10000/- లు Happy Card నందు Recommend చేయాలి. అర్హత వున్న Normal & Accidental క్లైమ్స్ కి 24 గం.లోపు నామినీ వారికి 10,000/- అందచేసి సంబంధిత వౌచర్స్ ను లాగిన్ లో అప్డేట్ చేయాలి.
ఎవరైతే అర్హత వున్న క్లైమ్స్ కి 10,000/- లు Recommend చేయారో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియచేసారు.
నార్మల్ క్లైమ్స్ కి సంబంధించి 5 రోజులో క్లైమ్స్ అప్లోడ్ చేయవలెను మరియు అర్హత ఉన్న ప్రతి క్లైమ్స్ కి 10,000 లు చెల్లింపు చేయవలెను.
ప్రమాదవశాత్తూ మరణించిన క్లయిమ్స్ ను పూర్తి పరిశీలన చేసి 16 రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అప్లోడ్ చేయవలసియున్నది మరియు పూర్తి అర్హత ఉన్న క్లయిమ్స్ కి మాత్రమే రూ.10000/- లు చెల్లింపు చేయవలసియున్నది.
ఇన్సూరెన్స్ కంపెనీ వారు Requirement అడిగిన 7 రోజుల్లో సంబంధింత డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలెను. ఒకవేల 7 రోజులో అప్లోడ్ చేయకపోతే సంబంధిత సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది.
E-Service account లో ఉన్న బీమా నిధులను 22.07.2023 తేదీ లోపు GSWS ఖాతాకు చెల్లించి WEA/WWDS LOGIN లో అప్డేట్ చేయాలని తెలియ చేయటం జరిగింది.
Leave a Reply