YSR Aasara: వైఎస్సార్ ఆసరా విడుదల కు సర్వం సిద్దం..ఆసరా స్టేటస్ చెక్ చేయండి

YSR Aasara: వైఎస్సార్ ఆసరా విడుదల కు సర్వం సిద్దం..ఆసరా స్టేటస్ చెక్ చేయండి

వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత అమౌంట్ విడుదల కు ప్రభుత్వం సిద్దమైంది. ఈ ఏడాది  రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాలు/డ్వాక్రా మహిళల ఖాతాలలో మొత్తం రూ.6,419.89 కోట్ల ను ప్రభుత్వం జమ చేయనుంది..

ఏ రోజు ఆసరా అమౌంట్ విడుదల చేస్తారు అంటే

మార్చ్ 25 న ఏలూరు జిల్లా దెందులూరు పర్యటన లో భాగంగా ఈ అమౌంట్ ను ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పది రోజుల పాటు ఉత్సవాల రూపంలో ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లాలు ప్రాంతాల వారీగా ఈ అమౌంట్ ను 10 రోజుల్లో జమ చేస్తారు.

YSR Asara Scheme Release Date: 25 March 2023

ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది

ఏప్రిల్ 11 2019 వరకు రుణాలు తీసుకొని , అప్పటి వరకు ఇంకా చెల్లిస్తూ ఉన్న అసలు మొత్తానికి ఈ పథకం వర్తిస్తుంది. . ఇందుకు సంబంధించి మొత్తం రుణం అమౌంట్ ను నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వైఎస్సార్ ఆసరా కింద చెల్లిస్తారు.. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇందులో ఇప్పటికే రెండు విడత రూ. 12,758.28 కోట్లను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మూడో విడతగా ఇప్పుడు అందజేసే రూ.6,419.89 కోట్లతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లను ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా వాడుకోవచ్చని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ పథకానికి ఎవరు అర్హులు స్టేటస్ చెక్ చేయండి

మీ జిల్లా మండలం ఊరు సెలెక్ట్ చేసి కింది లింక్ లో ఈ పథకానికి అర్హత ఉన్నటువంటి లబ్ధిదారుల లోన్ వివరాలు తెలుసుకోండి. Click below link for YSR Asara Status checking

2 responses to “YSR Aasara: వైఎస్సార్ ఆసరా విడుదల కు సర్వం సిద్దం..ఆసరా స్టేటస్ చెక్ చేయండి”

  1. Ramesh. B. Avatar
    Ramesh. B.

    CM ante nuvu anna 🇮🇳

  2. Sayyed meheron Avatar
    Sayyed meheron

    Chinnathurakapalem

You cannot copy content of this page