YSR ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇక మార్పులు చేర్పులు చేసుకున్న కార్డ్ పొందేందుకు ఆప్షన్

YSR ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇక మార్పులు చేర్పులు చేసుకున్న కార్డ్ పొందేందుకు ఆప్షన్

ఏపీలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ పథకం తొలి దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం అందరికీ ప్లాస్టిక్ PVC కార్డులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఎవరైతే కొన్ని మార్పులు చేర్పులు ఆరోగ్యశ్రీలో చేసుకున్నారో వారికి కొత్త మార్పులతో ప్రింట్ వచ్చే పరిస్థితి లేదు.

ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ను కల్పించింది. అన్ని మార్పులు చేరుకులతో కొత్తగా పివిసి కార్డు ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడ చేయాలి

ఇందుకోసం లబ్ధిదారులు మీ గ్రామ వార్డు సచివాలయంలో పని చేసే డిజిటల్ అసిస్టెంట్స్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

అయితే ఆర్డర్ పెట్టుకునే వారి కుటుంబంలో కనీసం ఒకరికైనా ఆధార్ మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉండాలి. తద్వారా వారికి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది.

ఈ పీవిసి సి కార్డుల కోసం ప్రస్తుతం 70 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా ఏ సేవలు అందిస్తున్నారు

గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రస్తుత ఆరోగ్యశ్రీ కి సంబంధించి కింది సేవలను అందుబాటులో ఉన్నాయి

  • ఆరోగ్యశ్రీ కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవడం
  • ఆరోగ్యశ్రీలో మార్పులు చేర్పులు
  • ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు
  • ఆరోగ్యశ్రీ డిస్పాచ్ స్టేటస్ అప్డేట్
  • ఆరోగ్యశ్రీ స్టేటస్
  • ఆరోగ్యశ్రీ పివిసి కార్డు

Click here to Share

You cannot copy content of this page