మహిళా రిజర్వేషన్ బిల్లు ,( నారీశక్తి వందన్ అధిననియమ్ ) చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో తీసుకు వచ్చినటువంటి ఈ బిల్లు ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. లోక్ సభ లో దాదాపు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా సంపూర్ణ మద్దతు తో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సుమారు 33 ఏళ్ల పోరాటం తర్వాత పట్టాలెక్కనున్న మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చట్టసభల్లో మహిళ ప్రాతినిధ్యాన్ని ఏ విధంగా మార్చనుందో వేచి చూడాలి.
అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని అసెంబ్లీ మరియు లోక్ సభ సీట్లు మహిళలకు కేటాయించబడతాయి అదే విధంగా ఏ సీట్లు మహిళలకు మొదటి ఎన్నికలలో మహిళలకు కేటాయించే అవకాశం ఉందో ఈరోజు పూర్తి డిటేల్స్ తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ లో 8 లోక్ సభ 58 అసెంబ్లీ స్థానాలు మహిళలకే
ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలను పరిగణలోకి తీసుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఎనిమిది లోక్సభ స్థానాలను మరియు 58 అసెంబ్లీ స్థానాలను మహిళలకి కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ లోక్సభ లేదా అసెంబ్లీ స్థానాల పునర్విభజన కానీ చేసినట్లయితే ఈ సంఖ్య మరింత పెరగనుంది.
అయితే తొలుత మహిళ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలకు రిజర్వేషన్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నుంచి రొటేషన్ పద్దతిలో వీటిని మారుస్తారు.
ఈ లెక్కన చూస్తే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న ఎనిమిది లోక్ సభ స్థానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
- విశాఖపట్నం
- గుంటూరు
- నరసరావుపేట
- నెల్లూరు
- తిరుపతి (ఎస్సీ)
- అనంతపురం
- నంద్యాల
- విజయవాడ
ఈ ఎంపి స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అదే జరిగితే ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి ఆశావహులు ఈ సీట్లను మహిళలకు వదిలేసుకోవాల్సిందే.
అత్యధిక మహిళా ఓటర్లు ఉన్నటువంటి 58 శాసనసభ స్థానాలు ఇవే..
1. భీమిలి 1,65,570
2. పాణ్యం 1,54,460
3. గాజువాక 1,53,505
4. చంద్రగిరి 1,47,522
5. తిరుపతి 1,44,295
6. మంగళగిరి 1,41,514
7. పెనమలూరు 1,40,953
8. రంపచోడవరం (ఎస్టీ) 1,40,090
19. పెందుర్తి 1,39,430
10. గురజాల 1,38,055
11. విశాఖపట్నం ఉత్తరం 1,37,949
12. కోవూరు 1,37,63
13. కర్నూలు 1,36,672
14. విజయవాడ తూర్పు 1,35,996
15. విజయవాడ సెంట్రల్ 1,35,763
16. గుంటూరు పశ్చిమ 1,35,311
17.గన్నవరం 1,34,847
18. మైలవరం 1,34,785
19. నెల్లూరు గ్రామీణం 1,34,323
20. తెనాలి 1,33,452
21. నంద్యాల 1,32,924
22. అనంతపురం అర్బన్ 1,32,802
23. ఇచ్ఛాపురం 1,32,642
24. కడప 1,32,431
25. శ్రీకాకుళం 1,32,2303
26. చింతలపూడి (ఎస్సీ) 1,32,182
27. రాజమహేంద్రవరం నగరం 1,31,734
28. ప్రత్తిపాడు (ఎస్సీ) 1,31,487
29. రాజమహేంద్రవరం | గ్రామీణం 1,31,483
30. గుంతకల్లు 1,31,306
31. కాకినాడ నగరం 1,30,741
32. పలమనేరు 1,30,413
33. విశాఖపట్నం తూర్పు 1,29,946
34. మాచర్ల 1,28,886
35. వినుకొండ 1,28,401
36. కాకినాడ గ్రామీణం 1,27,787
37. భీమవరం 1,27,590
38. రాయదుర్గం 1,27,358
39. మదనపల్లె 1,26,729
40. పోలవరం (ఎస్టీ) 1,25,235
41. కావలి 1,25,184
42. జమ్మలమడుగు 1,25,158
43. కొత్త పేట 1,24,901
44. పాయకరావు పేట (ఎస్సీ) 1,24,703
45. శ్రీకాళహస్తి 1,23,723
46. ప్రొద్దుటూరు 1,23,509
47. ఆదోని 1,23,311
48. విజయనగరం 1,22,966
49. రాయచోటి 1,22,679
50. కదిరి 1,22,542
51. రాప్తాడు 1,22,296
52. ఆలూరు 1,22,036
53. గుంటూరు తూర్పు 1,21,756
54. విజయవాడ పశ్చిమ 1,21,677
55. గూడూరు(ఎస్సీ) 1,21,523
56. ఒంగోలు 1,20,838
57. బనగానపల్లె 1,20,626
58. తాడిపత్రి 1,19,334
ఈ అసెంబ్లీ స్థానాల లో పోటీ కి ఉన్న అభ్యర్థులు కూడా ఎక్కడైతే కేంద్రం మహిళా రిజర్వేషన్ నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందో, ఆ స్థానాల కు ఈ సారి మహిళా అభ్యర్థులను బరి లో ఉంచాల్సి ఉంటుంది.
Leave a Reply