ఏపీలో ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనులకు హాజరయ్యే కూలీలు గంటకోసారి నీళ్లు తాగేలా పనిప్రదేశాల్లో ఏర్పాట్లు చేయాలని, నీడనిచ్చే షెడ్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. “కూలీలు ఉదయం 6 గంటలకు పనులకు హాజరై 11గంటల్లోగా ముగించాలి,” అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది.
🔥 Trending Now 🔥
🔗 Quick Links



