దేశ ఎన్నికల చరిత్ర లో తొలిసారిగా ఇంటి నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఎవరికి ఉంటుంది?
దేశ వ్యాప్తంగా 80 యేళ్లు పై బడిన వృద్దులు మరియు అంగవైకల్యం ఉన్న దివ్యాంగుల కు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
ఎప్పటి నుంచి అమలు?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 10 న ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఈ ఎన్నికలలో తొలిసారిగా ఇంటి నుంచి ఓట్ వేసే సౌకర్యం కల్పిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో pilot project కింద దీనిని పరిశీలించి తర్వాత దేశవ్యాప్తంగా దీనిని అమలు చేస్తామని సీఈసీ ప్రకటించారు.
కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ఇదే
మొత్తం 224 నియోజకవర్గాల కు సంబందించి మే 10 న పోలింగ్ , మే 13 న ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.
Leave a Reply