కొత్తగా వాలంటీర్ల ద్వారా Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లాగిన్ లో జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథక లబ్ధిదారులకు eKYC చేయుటకు ఆప్షన్ ఇవ్వటం జరిగింది. వాలంటీర్లు eKYC చేయు పూర్తి విధానము చూద్దాం.
Step 1 : మొదట మొబైల్ లో Beneficiary Outreach కొత్తగా వెర్షన్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. కొత్త వెర్షన్ కోసం కింద లింక్ పై క్లిక్ చెయ్యండి.
Step 2 : వాలంటీర్ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి టిక్ చేసి బయోమెట్రిక్ / ఐరిష్ / ఫేస్ ద్వారా లాగిన్ అవ్వాలి.
Step 3 : లాగిన్ అయిన వెంటనే Home Page లో జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకము అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
Step 4 : తరువాత Pattadar Details పై క్లిక్ చేయాలి
Step 5 : Select Village Name వద్ద మీ మండలం లోని BHP కలిగిన గ్రామాల పేర్లు కనిపిస్తాయి. మీ గ్రామం ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి.
Step 6 : గ్రామ సెలెక్ట్ చేసిన వెంటనే లబ్ధిదారుని ఖాతా నెంబర్, పేరు, ఆధార్, మండలం, eKYC స్టేటస్ Not Completed గా Red కలర్ లో చూపిస్తుంది. అప్పుడు ఖాతా నెంబర్ పై క్లిక్ చేయాలి.
Step 7 : వెంటనే eKYC చేయుటకు Pattadar Details ఓపెన్ అవుతాయి. అందులో Khaata Number, Pattadar Name, Aadhaar Number వివరాలు చూపిసస్థాయి. తరువాత రెండు ప్రశ్నలు చూపిస్తాయి
1. పై వివరాల్లో పట్టాదారుని ఆధార్ నెంబరు సరి అయినదా?
ఆధార్ నెంబర్ సరిగా ఉంటే – సరి అయినది
ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే – సరి అయినది కాదు ను టిక్ చేయాలి.
2. పట్టాదారు అందుబాటులో ఉన్నారా ?
- అందుబాటులో ఉంటే – ఉన్నారు
- లేకపోతే – లేరు ను టిక్ చేయాలి.
వెంటనే ఆధార్ నెంబర్ సరి చూసుకొని Consent టిక్ చేసి బయోమెట్రిక్ / ఐరిష్ / ఫేస్ ద్వారా లబ్ధిదారుని eKYC పూర్తి చేయాలి.
eKYC చేయాల్సిన సందర్భాలు:
1. పట్టాదారు అందుబాటులో ఉండి,చూపించిన ఆధార్ నెంబర్ సరిగా ఉంటే అప్పుడు “పై వివరాల్లో పట్టాదారుని ఆధార్ నెంబరు సరి అయినదా?” అనే ప్రశ్నకు “సరైనది” అని “పట్టాదారు అందుబాటులో ఉన్నారా ?” అనే ప్రశ్నకు “ఉన్నారు” అని టిక్ చేయాలి. అప్పుడు eKYC చేయాలి.
2. పట్టాదారు అందుబాటులో ఉండి,చూపించిన ఆధార్ నెంబర్ సరిగా లేకపోతే అప్పుడు “పై వివరాల్లో పట్టాదారుని ఆధార్ నెంబరు సరి అయినదా?” అనే ప్రశ్నకు “సరైనది కాదు” అని “పట్టాదారు అందుబాటులో ఉన్నారా ?” అనే ప్రశ్నకు “ఉన్నారు” అని టిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అప్పుడు eKYC చేయాలి.
3. పట్టాదారు అందుబాటులో లేకుండా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు హౌస్ హోల్డ్ మాపింగ్ ఉండి ,చూపించిన పట్టాదారు ఆధార్ నెంబర్ సరిగా ఉంటే అప్పుడు “పై వివరాల్లో పట్టాదారుని ఆధార్ నెంబరు సరి అయినదా?” అనే ప్రశ్నకు “సరైనది” అని “పట్టాదారు అందుబాటులో ఉన్నారా ?” అనే ప్రశ్నకు “లేరు” అని టిక్ చేయాలి.”పట్టాదారుని యొక్క కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ డేటా లో అందుబాటులో ఉన్నారా?” అనే ప్రశ్నకు “ఉన్నారు” అని సెలక్ట్ చేసి HH డేటా లో వారి పేరు సెలక్ట్ చేసి, రిలేషన్ సెలక్ట్ చేసి eKYC పూర్తి చేయాలి.
4. పట్టాదారు అందుబాటులో లేకుండా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు హౌస్ హోల్డ్ మాపింగ్ లో లేకపోతే ,చూపించిన పట్టాదారు ఆధార్ నెంబర్ సరిగా ఉంటే అప్పుడు “పై వివరాల్లో పట్టాదారుని ఆధార్ నెంబరు సరి అయినదా?” అనే ప్రశ్నకు “సరైనది” అని “పట్టాదారు అందుబాటులో ఉన్నారా ?” అనే ప్రశ్నకు “లేరు” అని టిక్ చేయాలి.”పట్టాదారుని యొక్క కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ డేటా లో అందుబాటులో ఉన్నారా?” అనే ప్రశ్నకు “లేరు ” అని సెలక్ట్ చేసి కుటుంబ సభ్యున్ని రిలేషన్ సెలక్ట్ చేసి eKYC పూర్తి చేయాలి.
5.పట్టాదారు అందుబాటులో లేకుండా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు హౌస్ హోల్డ్ మాపింగ్ లో లేకపోతే ,చూపించిన పట్టాదారు ఆధార్ నెంబర్ సరిగా లేకపోతే అప్పుడు “పై వివరాల్లో పట్టాదారుని ఆధార్ నెంబరు సరి అయినదా?” అనే ప్రశ్నకు “సరైనది కాదు” అని “పట్టాదారు అందుబాటులో ఉన్నారా ?” అనే ప్రశ్నకు “లేరు” అని టిక్ చేయాలి.”పట్టాదారుని యొక్క కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ డేటా లో అందుబాటులో ఉన్నారా?” అనే ప్రశ్నకు “లేరు ” అని సెలక్ట్ చేసి కుటుంబ సభ్యున్ని రిలేషన్ సెలక్ట్ చేసి eKYC పూర్తి చేయాలి.
6. పట్టాదారు అందుబాటులో లేకుండా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉండి ,చూపించిన పట్టాదారు ఆధార్ నెంబర్ సరిగా లేకపోతే అప్పుడు “పై వివరాల్లో పట్టాదారుని ఆధార్ నెంబరు సరి అయినదా?” అనే ప్రశ్నకు “సరైనది కాదు” అని “పట్టాదారు అందుబాటులో ఉన్నారా ?” అనే ప్రశ్నకు “లేరు” అని టిక్ చేయాలి.”పట్టాదారుని యొక్క కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ డేటా లో అందుబాటులో ఉన్నారా?” అనే ప్రశ్నకు “ఉన్నారు” అని సెలక్ట్ చేసి కుటుంబ సభ్యున్ని రిలేషన్ సెలక్ట్ చేసి eKYC పూర్తి చేయాలి.
Leave a Reply