ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ అవార్డులు 2023 అర్హతలు, ఎంపిక విధానం

,
ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ అవార్డులు 2023 అర్హతలు, ఎంపిక విధానం

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న మరియు సేవా వజ్ర పురస్కారాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నెల 22 అంటే ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్లను ప్రకటించటం జరుగుతుంది. వారికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు అందించటం జరుగుతుందివాలంటీర్ల అవార్డులకు ముఖ్యంగా హాజరు,పెన్షన్ పంపిణి, ఫీవర్ సర్వే మరియు ఇతర సర్వే లు పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. ఈ సంవత్సరానికి సంబందించిన జిల్లాల వారీగా సెలెక్ట్ అయిన వారి లిస్ట్ త్వరలో పోస్ట్ చేయటం జరుగుతుంది. 

2022 సంవత్సరం వాలంటీర్ అవార్డులకు సంబందించిన సమాచారం :

వాలంటీర్ అవార్డులను మొత్తం మూడు రకాలుగా ఇవ్వటం జరుగుతుంది.

  1. సేవా మిత్ర (Seva Mitra)
  2. సేవా రత్న (Seva Ratna)
  3. సేవా వజ్ర (Seva Vajra)

సేవా మిత్ర (Seva Mitra)

అర్హతలు : 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.

నగదు : 10,000/-

సేవా రత్న (Seva Ratna)

ఎవరికి : మండలం / మునిసిపాలిటీ కు 5 వాలంటీర్లను మరియు మునిసిపల్ కార్పొరేషన్ కు 10 వాలంటీర్లకు అందిస్తారు. 

అర్హతలు :

  1. 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
  2. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
  3. హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు. 

నగదు : 20,000/-

సేవా వజ్ర (Seva Vajra)

ఎవరికి : నియోజకవర్గానికి 5 వాలంటీర్లకు అందిస్తారు. 

అర్హతలు :

  1. 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
  2. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
  3. హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు. 

నగదు : 30,000/-

వాలంటీర్ అవార్డులకు ఉండవలసిన అర్హతలు :

1. 2022 మార్చి 31 నాటికీ 1 సంవత్సరం పూర్తి చేసి ఉండాలి.

2. పరిగణలోకి తీసుకోను సమయంలో ఎటువంటి ఫిర్యాదులు / అర్జీ లు వచ్చి ఉండకూడదు.

పాయింట్ల వివరాలు :

1. బయోమెట్రిక్ హాజరు – 35 పాయింట్లు

2. పెన్షన్ పంపిణి – 35 పాయింట్లు

3. ఫీవర్ సర్వే – 30 పాయింట్లు

1.బయోమెట్రిక్ హాజరు అర్హత : 

పరిగణలోకి తీసుకోను నెలల్లో 4 సార్లు అయిన హాజరు వేసి ఉండాలి. ఆయా నెలలో 4 సార్లు హాజరు వేసి ఉంటే ఆ నెల మొత్తం 100% హాజరు పరిగనిస్తారు. ఆ విధం గా నెలకు కనీసం 4 సార్లు హాజరు వేసిన నెలలు ‘N’ అనుకుంటే హాజరుకు సంబందించిన మార్కులు = N×(35/12)

ఉదాహరణకు :

ఒక వాలంటీర్ ప్రతినెల కనీసం లో కనీసం నెలకు నాలుగుసార్లు బయోమెట్రిక్ హాజరు వేసినట్టయితే అవార్డుకు గానూ గత 4 నెలల ను పరిగణలోకి తీసుకున్నట్లయితే అప్పుడు హాజరు సంబంధించిన మార్కులు = 4 × (35/12)

                 = 11.66

బయోమెట్రిక్ హాజరు రిపోర్ట్ లింక్ :

హాజరుకు సంబందించి కింద లింక్ (Click Here) పై క్లిక్ చేయండి. అందులో మీ జిల్లా, మండలం/మునిసిపాలిటీ, గ్రామం/వార్డు సచివాలయం సెలెక్ట్ చేసి, Category లో Volunteer సెలెక్ట్ చేయండి. ఒక సంవత్సరం హాజరు రిపోర్ట్ కావాలనుకుంటే అప్పుడు From Date వద్ద ఒక సంవత్సరం క్రితం తేదీ ను, To Date వద్ద ఏ రోజు వరకు రిపోర్ట్ కావాలో ఆ తేదీ ను సెలెక్ట్ చేసుకోవాలి. 

2. పెన్షన్ పంపిణి అర్హత : 

ప్రతి నెల మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు పెన్షన్ పంపిణీ మరియు మొదటిరోజు 100% పెన్షన్ పంపిణీ పరిగణలోకి తీసుకోవడం జరుగును. 

పెన్షన్ పంపిణీకి సంబంధించి మార్కులను ఇచ్చే విధానం

A. వాలంటీర్ కు 25 కన్నా తక్కువ పెన్షనర్లు ఉంటే :

 వాలంటీరు 100% పెన్షన్లను మొదటిరోజు పంపిణీ చేసినట్లయితే పూర్తి మార్కులు ఇవ్వడం జరుగును అంటే 35 మార్కులు ఇస్తారు లేని పక్షాన 15 మార్కులు ఇస్తారు.

B.వాలంటీర్ కు 25 లేదా 25 కన్నా ఎక్కువ పెన్షన్ దారులు ఉన్నట్టయితే :

[ [ మొదటి రోజు పెన్షన్ పంపిణీ × 35 ] + [ 2వ, 3వ 4వ 5వ రోజు పెన్షన్ పంపిణీ × 25 ] ] / మొత్తం పెన్షన్దారులు

ఉదాహరణకు :

A. వాలంటీర్ కు 20 పెన్షన్ లు ఉన్నట్టయితే అన్ని కూడా నెలలో మొదటి రోజు ఇస్తే వారికీ మార్కులు = 35, మొదటి రోజు కాకుండా మిగతా రోజుల్లో ఇస్తే అప్పుడు మార్కులు = 16

B. వాలంటీర్ కు 35 పెన్షన్ లు ఉన్నట్టయితే మొదటి రోజు 15 మరియు 2 వ రోజు 5, 3వ రోజు 4, 4వ రోజు 6 మరియు 5వ రోజు 2 పెన్షన్ లు ఇస్తే అప్పుడు మార్కులు = [15×35 ] + [ (5+4+6+2)×25] / 35

     = 12.14

3. ఫీవర్ సర్వే అర్హత :

డిసెంబర్ 2021 & జనవరి 2022 నెలల్లో 100% ఇళ్లకు ఫీవర్ సర్వ్ ను పరిగణలోకి తీసుకోవడం జరుగును. ప్రతి ఫీవర్ సర్వే లో 100% ఇళ్లను కవర్ చేసినట్టయితే అప్పుడు ఫీవర్ సర్వేలో ఇళ్లను కవర్ చేసిన శాతం (N%) = [ మొత్తం కవర్ చేసిన హౌస్ హోల్డ్ సంఖ్య ] / [మొత్తం హౌస్ హోల్డ్ సంఖ్య ] ×100

మార్కులు = N% × 30

ఫీవర్ సర్వే రిపోర్ట్ :

ఉదాహరణకు :

డిసెంబర్ 2021, జనవరి 2022 సర్వే లలో   

మొత్తం హౌస్ హోల్డ్ లు – 55

సర్వ్ చేసినవి – 44 అయితే అప్పుడు

సర్వే % = [ 44/55 ] ×100

              = 0.8

మార్కులు = 0.8×30 = 24

Click here to Share

One response to “ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ అవార్డులు 2023 అర్హతలు, ఎంపిక విధానం”

  1. Volunteer Awards Date: ఆరోజే వాలంటీర్ల కు అవార్డులు, సన్మానం..ఎంతమంది ఎంపిక అంటే – GOVERNMENT SCHEMES UPDATES

    […] ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ అవార్డులు 20… […]

You cannot copy content of this page