రాష్ట్రవ్యాప్తంగా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న వారందరికీ గుడ్ న్యూస్.. వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ రాయితీ కింద ఇస్తున్నటువంటి జగనన్న విద్యా దీవెన అమౌంటు ను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల విడుదల చేయనుంది.
2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి చివరి క్వార్టర్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ నెల అనగా మే 24 న జమ చేయనుంది. జనవరి – మార్చ్ త్రైమాసికనికి సంబంధించి ఈ అమౌంట్ ను జమ చేస్తుంది.
Jagananna Vidya Deevena to be released on : 24th May 2023
ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలలో పూర్తి ఫీజు రాయితీ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. మార్చ్ 19న మూడో విడత అమౌంట్ విడుదల చేయగా ప్రస్తుతం నాలుగో విడత జమ చేస్తున్నారు.
ఇక జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి స్టూడెంట్స్ ఎవరికైతే ఈకేవైసి ఇంకా పెండింగ్ ఉందో వారు మీ దగ్గరలోని సచివాలయం కి వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేయగలరు.
జగనన్న విద్యా దీవెన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందటానికి కింది లింక్ ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.
Leave a Reply