త్వరలో విద్యా దీవెన బకాయిలు విడుదల

త్వరలో విద్యా దీవెన బకాయిలు విడుదల

జగనన్న విద్యా దీవెన పథకం పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం మొత్తం 3500 కోట్ల రూపాయల మేర ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయలను పెండింగ్ పెట్టింది.

ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో ఈ అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారో తెలియక చాలామంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు. అయితే దీనిపై ఇప్పటికే విద్యార్థులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించిన నారా లోకేష్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపారు.

త్వరలో 3500 కోట్ల విద్యా దీవెన బకాయిలు విడుదల

గత ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పెట్టిన 3,500 కోట్ల విద్యా దీవెన నిధులను త్వరలో విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు త్వరలో గుడ్ న్యూస్ తెలపనున్నట్టు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.

గత ప్రభుత్వం పెట్టిన బకాయిల కారణంగా విద్యార్థులు సొంతంగా ఫీజులను కాలేజీలకు చెల్లించడం జరిగింది. ఇందులో చివరి సంవత్సరం చదివిన విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే అమౌంట్ కళాశాలలకు చెల్లించిన వారికి నేరుగా వారి ఖాతాలోనే అమౌంట్ జమ చేయనున్నారా? ఇంకా చెల్లించాల్సిన వారికి సంబంధించి నేరుగా కళాశాలలకు చెల్లిస్తారా అనే అంశంపై మరింత స్పష్టతను త్వరలో ప్రభుత్వం తెలియజేయనుంది.

Nara Lokesh tweeted as below Fees Reimbursement pending amount

“To all our student friends: The YSRCP Govt has cheated you by not paying fee reimbursement dues to the tune of Rs.3500 crores. I’m collaborating with my colleagues in the Cabinet and Ministry to resolve this issue and assure you that you’ll hear good news very soon. I am with you.”

Minister tweet on Vidya Deevena Fees Reimbursement pending amount

గత ప్రభుత్వం విద్యార్థుల ఫీజులను చెల్లించకుండా బకాయిలను పెట్టి విద్యార్థులను మోసగించిందని ఎక్స్ వేదికగా నారా లోకేష్ ఆరోపించారు. తన క్యాబినెట్ మంత్రులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తామని దీనికి సంబంధించి విద్యార్థులకు త్వరలో గుడ్ న్యూస్ తెలుపుతామని నారా లోకేష్ అన్నారు.

ఇదే కాకుండా ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి  ఫీజు రీయింబర్స్మెంట్ పై విధి విధానాలను ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంటును నేరుగా కాలేజీలకు జమ చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో దీనిపైన మరింత స్పష్టతను ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Click here to Share

3 responses to “త్వరలో విద్యా దీవెన బకాయిలు విడుదల”

  1. Amitha Avatar
    Amitha

    4th year lo maku fees reimbursement amount veyaledu ipudu release cheste maku chala better inka fees pay cheyaleka ma p.c certificates college lo ne unnai if the amount is credited then it will be very useful to us

  2. Vasu Avatar
    Vasu

    Maa MBA certificates kuda college lo vunnai certificate adigite amount pay cheyandi antunnaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page