రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రతి ఏటా నాలుగు విడతల్లో ఫీజు రీయంబర్స్మెంట్ అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏడాది మూడవ క్వార్టర్ అమౌంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది.
ఆగస్టు 28న విద్యా దీవెన అమౌంట్ [Vidya Deevena 2023-24 Release Date ]
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆగస్టు 28వ తేదీన గత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడవ క్వార్టర్ అమౌంటును ముఖ్య మంత్రి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. చిత్తూరు జిల్లా నగిరి పర్యటన లో భాగంగా సీఎం ఈ అమౌంట్ ను విడుదల చేస్తారు.
Vidya Deevena 2023 Release Date : 28.08.2023
విద్యార్థుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి [Vidya Deevena 2023 EKYC ]
జగనన్న విద్యా దీవెన గత విద్యా సంవత్సరం మూడో క్వార్టర్ అమౌంట్ కు సంబంధించి సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ ద్వారా విద్యార్థుల నుంచి థంబ్ మరియు ఈకేవైసి వివరాలను సేకరించే ప్రక్రియను సచివాలయాల ద్వారా పూర్తి చేయడం జరిగింది.
విద్యార్థుల నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు థంబ్ మరియు ఈ కేవైసీ వివరాలు తీసుకోవడం జరిగింది.
జగనన్న విద్యా దీవెన 2023 స్టేటస్ [Vidya Deevena 2023-24 Status]
ప్రతి ఏటా విద్యార్థులకు ఫీజు అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు ప్రతి క్వార్టర్ కి సంబంధించి తమ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలను కింది లింక్ ద్వారా చెక్ చేయవచ్చు. పూర్తి ప్రాసెస్ కింది లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి.
విద్యా దీవెన లెటస్ట్ అప్డేట్ కి సంబదించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పొందటానికి కింది లింక్ పై క్లిక్ చేయండి లేదా కింద ఇవ్వబడిన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.
Click here to Join Telegram for Regular Updates
Leave a Reply