రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ఈ గడువును ప్రభుత్వం పొడిగించడం జరిగింది.
ప్రతి ఏడాది రెండు విడతల్లో ఈ రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అర్హతగా ఉండి ఎంపికైనటువంటి విద్యార్థులకు ప్రభుత్వం రెండు విడుదల అమౌంటును జమ చేస్తుంది.
గత ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్ధులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చెయ్యడం జరిగింది.
తాజాగా రెండో విడత సంబంధించి విదేశీ విద్యా దీవెన సంబంధించి రిజిస్ట్రేషన్ లను ప్రభుత్వం గత నెల ప్రారంభించగా, ఈ దరఖాస్తులకు మే 31 చివరి తేదీన మొదట నిర్ణయించడం జరిగింది. అయితే ఈ దరఖాస్తు గడువును జూన్ 10వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
Videshi Vidya deevena last date : 10 June 2023
అర్హులైన విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
విదేశీ విద్యాధీన పథకానికి సంబంధించి అన్ని లింక్స్ కొరకు కింది పేజిని చెక్ చేయండి
Leave a Reply