ఏపి లో ఇటీవల ఏప్రిల్ 17న విడుదల కావాల్సి ఉన్న వసతి దీవెన ఏప్రిల్ 26 కి వాయిదా పడిన విషయం తెలిసిందే.. ఎందుకు సంబంధించి కారణాలు ప్రభుత్వం అప్పట్లో వెల్లడించలేదు.. అయితే తాజాగా ఎందుకు సంబంధించినటువంటి కారణాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీడియాకు వెల్లడించారు.
నిధుల కొరతతోనే వసతి దీవెన వాయిదా
విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మరియు ఇతర సమస్యలు చర్చించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ లో పర్యటించనున్నారని మీడియా సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వసతి దీవెన వాయిదాకి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమ క్యాలెండర్ ప్రకారం వసతి తీవ్ర ఇప్పటికే ప్రారంభించాల్సి ఉండగా అయితే ఆర్థిక శాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి కి సూచించినట్లు ఇందుకనుగుణంగా ఈనెల 26 కు వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వసతి దీవెన జమ చేయుటకు నిధుల కొరత ఉండటం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఏదైనా సంక్షేమ పథకం ప్రారంభించిన వెంటనే సంబంధిత లబ్ధిదారుల ఖాతాలో వెంటనే నిధులు జమ కావాలని ముఖ్యమంత్రి భావిస్తారని, అది కుదరదనే భావనతోటి ప్రస్తుతానికి కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఈ మేరకు ముఖ్యమంత్రికి తెలిపినట్లు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు.
భవిష్యత్తులో సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని, సంక్షేమ క్యాలెండర్ ప్రకారమే కార్యక్రమాలను నిర్వహించేలా చూస్తామని ఆయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఇంజనీరింగ్ తదితర కోర్సులలో చదువుతున్నటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వసతి దీవెన పేరుతో ప్రతి సంవత్సరం రెండు విడతల్లో 20000 రూపాయలను జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ కార్యక్రమాన్ని వరుసగా డిసెంబర్ నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు ఏప్రిల్ 26న విడుదల చేయనుంది.
జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన studybizz schemes వెబ్సైట్ ను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.
Leave a Reply