జగనన్న వసతి దీవెన పథకం సంబంధించి వాయిదాల పర్వం కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉన్న వసతి దీవెన రెండో విడత అమౌంట్ తొలుత ఫిబ్రవరి, తర్వాత మార్చ్ కి వాయిదా పడింది.
మార్చ్ 31 న అమౌంట్ విడుదల చేయనున్నట్లు ప్రకటించినా తిరిగి ఏప్రిల్ కి వాయిదా వేయడం జరిగింది. అయితే ఏప్రిల్ లో ఏ తేదీన విడుదల చేస్తారు అనేది ఇంకా ప్రకటించలేదు. అయితే చాలా వరకు ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 2023-24 సంక్షేమ క్యాలెండర్ లో కూడా ఏప్రిల్ అని ఉంది. వాస్తవానికి ఈ అమౌంట్ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించినది. అదే విద్యా సంవత్సరం లో ప్రతి ఏటా ప్రభుత్వం అమౌంట్ ను జమ చేయాల్సి ఉన్నా, పలు అనివార్య కారణాల వలన వాయిదాలు వేస్తూ వస్తుంది.
ఇప్పటికే విద్యార్థులు ఎంతగానో ఈ వసతి అమౌంట్ కోసం వేచి చూస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు విద్యా దీవెన మూడో క్వార్టర్ అమౌంట్ కూడా పలు వాయిదాల అనంతరం మార్చ్19 న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక విద్యా దీవెన 4 వ క్వార్టర్ అమౌంట్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంది.
జగనన్న వసతి దీవెన పథకం సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన studybizz వెబ్సైట్ ను రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు.
Leave a Reply