సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా వరుసగా ఐదో ఏడాది అమౌంట్ ను సీఎం విడుదల చేశారు.
ఇప్పటివరకు నాలుగు విడతల సాయాన్ని అందించిన సీఎం, వరుసగా ఐదో విడత 10 వేల ఆర్థిక సాయాన్ని శుక్రవారం బటన్ నొక్కి జమ చేశారు.
విజయవాడలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ
విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా అమౌంట్ జమ చేయడం జరిగింది. 2023-24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ.275.93 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం డ్రైవర్ల ఖాతాలో జమ చేయడం జరిగింది.
ఈ విడత తో కలిపి వైఎస్సార్ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు పేర్కొంది.
కింది స్టేటస్ లింక్ ద్వారా మీరు మీ యొక్క పేమెంట్ వివరాలను తెలుసుకోవచ్చు. పేమెంట్ పూర్తిగా అయిన తర్వాత మీకు స్టేటస్ కనిపిస్తుంది. పూర్తి ప్రాసెస్ కింది లింక్ లో ఇవ్వబడింది. చెక్ చేయగలరు
మరిన్ని లేటెస్ట్ వైఎస్ఆర్ వాహన మిత్ర అప్డేట్స్ కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి మరియు కింద ఇవ్వబడిన టెలిగ్రామ్ లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి.
Leave a Reply