వైయస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో కొత్త దరఖాస్తులు మరియు వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
గతంలో ఏ ఈ పథకాన్ని ఆగస్టు 31న విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ వివిధ కారణాల చేత అమౌంట్ విడుదల వాయిదా పడింది.
తాజాగా ప్రభుత్వం వాహన మిత్ర లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఇచ్చింది. ఈ నెల 29 న కాకినాడ పర్యటన లో భాగంగా వైయస్సార్ వాహన మిత్ర పథకం 5 విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
Leave a Reply